Site icon NTV Telugu

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

కరోనాతో గతేడాది ఇంటర్ పరీక్షలు జరగలేదు… మొదటి సంవత్సరంలో వచ్చిన మార్క్స్ ఆధారంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఫలితాలు ప్రకటించింది తెలంగాణ ఇంటర్‌ బోర్డు. మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మినిమం మార్క్స్ వేసి పాస్ చేశారు. విద్యార్థులను సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షలు ఆఫ్ లైన్ మోడ్ లో జరుగుతున్నాయి. దీంతో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణ పై బోర్డ్ దృష్టి పెట్టింది. అయితే ఎప్పుడు నిర్వహించాలి అనే దాని పై ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు అధికారులు. థర్డ్ వేవ్ వస్తుందని ప్రచారం జరుగుతుండటంతో తేదీల ఖరారుపై డైలమాలో ఉన్నారు.

డిగ్రీ ,పిజీలలో వేల సంఖ్యలోనే విద్యార్థులు ఉంటారు. రెసిడెన్షియల్ కాలేజీలు, హాస్టల్స్‌లో ఉండి చదువుకునే వారు తక్కువగా ఉంటారు. అందువల్ల ఆ పరీక్షల నిర్వహణకు పెద్దగా ఇబ్బందులు రావడంలేదు. 18సంవత్సరాల పైబడిన వారు.. కొందరు వాక్సిన్ వేసుకొని ఉన్నారు. కానీ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థుల సంఖ్య 4 లక్షల 59 వేలు. ఇంటర్‌లో రెసిడెన్షియల్ కాలేజీల సంఖ్య ఎక్కువ. ప్రైవేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో కోవిడ్ నిబంధనల మేరకు హాస్టల్స్ మెయింటైన్ చేయడం కష్టం. దీంతో పరీక్షల నిర్వహణపై మల్లగుల్లాలు పడుతోంది ఇంటర్ బోర్డ్.

కరోనా కేసులు పెరగకపోతే సెప్టెంబర్ నెలలో పరీక్షల పెట్టె ఆలోచనలో ఉంది ఇంటర్‌ బోర్డ్‌. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపిస్తామని అంటున్నారు ఇంటర్ బోర్డు అధికారులు. 3గంటల పరీక్ష కాకుండా గంటన్నరకు కుదించి.. ప్రశ్నలు తగ్గించి పరీక్షలు నిర్వహించాలనే ఆలోచన ఉందని అంటున్నారు. ఇంటర్ ఫలితాల ప్రకటన క్రైటీరియా నచ్చని వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది తెలంగాణ ఇంటర్‌ బోర్డ్.

Exit mobile version