Site icon NTV Telugu

Governor Tamilisai: నేడు ఢిల్లీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై.. పెండింగ్ బిల్లులు..?

Governer Tamilasai

Governer Tamilasai

Governor Tamilisai: పెండింగ్ బిల్లులను ఆమోదించేలా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా మూడు బిల్లులకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గురువారం న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులను గవర్నర్ ఆమోదించలేదు. ఈ తరుణంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Read also: Fire accident: మల్లాపూర్‌ ఘటన.. ఫైర్ సేఫ్టీ పాటించకపోవడం వల్లే అగ్ని ప్రమాదం

ఈ ఏడాది ఫిబ్రవరి 3న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాకముందే కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలపడం లేదని ఈ ఏడాది జనవరి 31న ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు సూచనల మేరకు రాజ్‌భవన్‌, రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులు రాజీ ప్రతిపాదన తీసుకొచ్చారని, వారి మధ్య రాజీ కుదిరిందని న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. దీంతో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. బడ్జెట్ సమావేశాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి గవర్నర్‌కు ఆహ్వానం అందింది. అయితే ఈ పరిణామం రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరిందని భావిస్తున్నారు. కానీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత పెండింగ్ బిల్లుల విషయమై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చకు దారి తీసింది. ఈ తరుణంలో తమిళిసై ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతోనూ గవర్నర్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Agent: ‘ఏజెంట్’ పనైపోయింది… ఇక ఆ భారం అఖిల్ పైనే

Exit mobile version