Governor Tamilisai: అమరవీరులను స్మరిస్తూ బావోద్వేగంతో గవర్నర్ తమిళి సై ప్రసంగించారు. మొత్తం ప్రసంగాన్ని తెలుగులోనే గవర్నర్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే కాదన్నారు తెలంగాణ గవర్నర్ తమిళి సై. రాజ్ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. జెండా వందనం చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ భవన్ లో చిన్నారులతో కలిసి తెలంగాణ పాటలకు నృత్యాలు చేసి గవర్నర్ తమిలి సై ను ఆకట్టుకున్నారు. కొంత మంది అభివృద్ధి కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అయితేనే సంపూర్ణ అభివృద్ధి అనిపించుకుంటుందన్నారు.
వచ్చే సంవత్సరం నాటికి దేశంలో తెలంగాణ నంబర్ వన్ కావాలని అన్నారు. జై తెలంగాణ అంటే స్లోగన్ ఒక్కటే కాదు.. ఆత్మ గౌరవ నినాదమని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు. అమరవీరులందరికీ నా జోహార్లు తెలిపారు. నా జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసమే అన్నారు. దేవుడు నన్ను తెలంగాణ కు పంపడం గొప్ప అదృష్టమన్నారు. నేను మీతో ఉన్నాను. మీరు నాతో ఉన్నారని గవర్నర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణా ప్రజలకి శుభాకాంక్షలు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. ఈ మహోన్నత పోరాటంలో ఎంతొ మంది యువకులు, అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన ఈ తెలంగాణ రాష్టం అన్నిట్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నామని తెలిపారు. నాకు చాలా ఆనందంగా ఉంది.. ఇవాళ 1969 తెలంగాణ ఉద్యమ కారులను కలిశానని గవర్నర్ అన్నారు.
హైదరాబాద్ అంతర్జాతీయంగా పేరు సంపాదించిందని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. కేవలం ఒక్క చోటే కాకుండ రాష్ట్ర వ్యాప్తంగా అభివృధి జరుగుతునే అభివృధి జరిగినట్లు అన్నారు. ఈ దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ అందరికి పిలుపునిస్తున్నామని తెలిపారు. జై తెలంగాణ అనేది ఒక స్లోగన్ కాదు.. ఒక ఆత్మ గౌరవమన్నారు. తెలంగాణ పోరాట యోధులకి నా ధన్యవాదాలు తెలిపారు. అమరవీరులను స్మరిస్తూ బావోద్వేగంతో గవర్నర్ తమిళి సై ప్రసంగించారు. మొత్తం ప్రసంగాన్ని తెలుగులోనే గవర్నర్ మాట్లాడారు. అనేక పోరాటాల వల్ల సాధించుకున్న తెలంగాణకు గవర్నర్ గా రావడం దేవుని ఆశీర్వాదమన్నారు. ఆధునిక ప్రపంచంలో తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. తెలంగాణ అమరవీరుల కు పేరుపేరునా ధన్యవాదాలని గవర్నర్ తెలిపారు.
Naxals: బ్రిజ్ భూషన్ కి వ్యతిరేకంగా.. రెజ్లర్లకు సపోర్ట్ గా నక్సల్స్ పోస్టర్లు..