NTV Telugu Site icon

TamilaSai: ఎవరినీ రిక్వెస్ట్‌ చేయలేదు.. ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన తమిళిసై..!

Tamilisai

Tamilisai

TamilaSai: తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడులోని దక్షిణ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి పోటీ చేసేందుకు ఆమె సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈనెల 27న ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై ఎంపీ అభ్యర్థిత్వం కోసం కోరనున్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలకు తమిళిసై స్పందించారు. గవర్నర్‌గా తాను సంతోషంగా ఉన్నానని అన్నారు. తను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయవద్దని కోరారు. ఏదైనా నిర్ణయం ఉంటే తెలియజేస్తామని చెప్పారు. తాను తూత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్న వార్తలు కేవలం ప్రచారమేనని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రధాని మోదీ, శ్రీరాముడి దయతో తాను గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్నానని అన్నారు. తాను ఢిల్లీ వెళ్లలేదని.. ఎవరినీ రిక్వెస్ట్ చేయలేదన్నారు. తూత్తుకుడి వరదను చూసి వెళితే తప్ప ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. తాను ఇక్కడే ఉంటానని.. ప్రజలతో మమేకమై పనిచేయడం ఇష్టమని.. స్పష్టం చేశారు.

Read also: PM Modi: అయోధ్య‌లో కొత్త ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధాని మోడీ

తమిళిసై గతంలో రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకుడి నుంచి ఎంపీగా ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరో మూడు సార్లు అసెంబ్లీకి పోటీ చేసినా ఆమె గెలుపు తలుపు తట్టలేదు. పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో తెలంగాణ గవర్నర్‌గా తమిళిసైని నియమించింది. ఇక.. 2021 నుండి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆమె రాజ్యాంగ పదవిని వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభకు పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమిళిసై ఎంపీగా పోటీ చేసేందుకు ప్రధాని మోడీ, అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే నెలలో రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను కేంద్రం నియమించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. జనవరిలో రాష్ట్ర గవర్నర్ మార్పు ఖాయమని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే గవర్నర్‌గా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీయాంశమైంది. బీజేపీ నుంచి ఎవరైనా నియమిస్తారా? లేక పార్టీలకు సంబంధం లేని రిటైర్డ్ అధికారులను, రిటైర్డ్ న్యాయమూర్తులను నియమిస్తారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై తమిళిసై స్పందించింది క్లారిటీ ఇచ్చారు.

PM Modi: అయోధ్య‌లో కొత్త ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధాని మోడీ