NTV Telugu Site icon

జీవో 75 విడుదల.. స్కూల్‌ ఫీజులపై కీలక ఆదేశాలు

TS Government

కరోనా మహమ్మారి కారణంగా.. స్కూళ్లు మూతపడినా.. ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతోనూ దోపిడీకి పాల్పడుతున్నాయి కొన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థలు.. అయితే, ఫీజుల వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న తెలంగాణ ప్రభుత్వం.. కీలక ఆదేశాలు జారీ చేసింది.. గతేడాది జీవో 46ను కొనసాగిస్తూ .. కొత్తగా జీవో 75 ను విడుదల చేసింది ప్రభుత్వం. 2020..21 విద్యా సంవత్సరంలో ఉన్న ఫీజులనే ఈ ఏడాది తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. కేవలం ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలని.. అదీ నెల వారిగా వసూలు చేయాలని జీవోలో స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే.. స్కూల్స్ అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించింది తెలంగాణ సర్కార్.