NTV Telugu Site icon

Revanth Reddy: సర్కార్ గుడ్ న్యూస్.. గ్రామ సభల తర్వాత కూడా దరఖాస్తు ఇవ్వొచ్చు..

Revanth Reddy Cm

Revanth Reddy Cm

Revanth Reddy: గ్రామ పంచాయతీలలో కూడా అప్లికేషన్లు ఇవ్వచ్చని అన్నారు. గ్రామ సభల్లో ఇవ్వకపోతే.. గ్రామ పంచాయతీలలో ఇవ్వచ్చన్నారు. గ్రామ సభల తర్వాత కూడా.. దరఖాస్తు ఇవ్వచ్చని తెలిపారు. సచివాలయంలో ప్రజాపాలన లోగో, దరఖాస్తును సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ.. రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఒకే దరఖాస్తుతో అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. మారు మూల పల్లె వరకు సంక్షేమ పథకాలు అందాలి అన్నదే మా లక్ష్యని అన్నారు. తండాలు, పేదల దగ్గరికి పాలన అందిస్తామని అన్నారు. పదేళ్లు ప్రభుత్వం – ప్రజలకు ఎంత దూరంగా ఉంది అనేది ప్రజా వాణి చూస్తే అర్థం అవుతుందన్నారు. ప్రజావాణిలో వచ్చిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు. ప్రజలు హైదరాబాద్ వరకు వచ్చే ఇబ్బంది రాకుండ ఉండేలా.. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు పోవాలి అని నిర్ణయం తీసుకున్నామన్నారు. గడిలా దగ్గరకు ప్రజలు రావడం కాదన్నారు.

దరఖాస్తుతో వివరాలు మాకు అందుతాయన్నారు. ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయగలుగుతం అనేది తెలుస్తుందన్నారు. మంచి ఆలోచనతో చేస్తున్నామని తెలిపారు. ప్రతి మండలం రెండు గ్రూపులు ఉంటాయని, ఒక గ్రూప్ కి ఎండీఓ.. మరో గ్రూప్ కి ఎమ్మార్వో బాధ్యత వహిస్తారని క్లారిటీ ఇచ్చారు. గ్రామ పంచాయతీలలో కూడా అప్లికేషన్లు ఇవ్వచ్చని అన్నారు. గ్రామ సభల్లో ఇవ్వకపోతే.. గ్రామ పంచాయతీలలో ఇవ్వచ్చన్నారు. గ్రామ సభల తర్వాత కూడా.. దరఖాస్తు ఇవ్వచ్చని తెలిపారు. ఎవరి కోసం ఎదురు చూడంకండి.. ఎవరి దగ్గరకు పోకండి అని తెలిపారు. ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుందని అన్నారు. గడిలు పాలన.. గ్రామాలకు తీసుకు వస్తున్నాం.. ఇచ్చిన మాట ప్రకారం.. ప్రజల దగ్గరకు పాలన పంపుతున్నామని తెలిపారు. కేటీఆర్…ప్రజా వాని సమస్య పరిష్కారం కాలేదు అంటున్నాడని మండిపడ్డారు. లక్ష కోట్లలో లక్ష సాయం చేశారు కేటీఆర్ అన్నారు. ప్రజా వాని లక్ష్యం నెరవేరినట్టే అని.. కేటీఆర్ లక్ష కోట్లను..ప్రజలకు పంచిపిస్తాం.. లక్ష ఇచ్చాడు..ఇంకా మిగిలినవి ఇప్పిస్తామంటూ వ్యంగాస్త్రం వేశారు. బావ.. బామ్మర్దులు తాపత్రయం తప్పితే.. మిగిలిన సభ్యులు ఏదైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.

ఎవరు వాళ్ళతో కలిసి రాలేదు.. సభలో చెప్పుకోలేనిది..ఇంటి దగ్గర మాట్లాడుతున్నాడని అన్నారు. అసెంబ్లీలో చెప్పుకునేందుకు విషయం లేదు కేటీఆర్..హరీష్ కి అంటూ తెలిపారు. ప్రజల రక్త మాంసాలు అవి.. వాళ్ళు తింటున్నది రక్తపు కూడు అంటూ మండిపడ్డారు. ప్రజల రక్త మాంసాలతో లక్ష కోట్లు సంపాదించారు వాళ్ళు కేటీఆర్.. హరీష్ అంటూ సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. కార్లే కొనలేదు అని కేసీఆర్ చెప్పిండు.. 22 ల్యాండ్ క్రూసర్ కొన్నాడు కేసీఆర్ అన్నారు. అవి విజయవాడలో పెట్టాడని తెలిపారు. కొత్త గవర్నమెంట్ వచ్చాకా.. తెద్దాం అనుకున్నాడని, దరిద్రం నెత్తిన కూర్చుంది అవి మాకు వచ్చాయి క్రూసర్ కార్లు అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. మార్పు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు.. ప్రజా ప్రతినిధులుగా మేము లోపలికి రాలేదు.. ఇప్పుడు మీడియా.. మేము లోపలికి వచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియాకి స్వేచ్ఛ ఇస్తాం.. కానీ దాన్ని దుర్వినియోగం చేయవద్దని అన్నారు. జర్నలిస్టుల సమస్యలు కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.

Health Tips : నల్ల వెల్లుల్లిని ఇలా తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?