NTV Telugu Site icon

CM KCR: మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం.. కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ

Cm Kcr Mainority

Cm Kcr Mainority

CM KCR: బీసీల మాదిరిగానే మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీల ఆర్థిక స్వావలంబనకు ఈ పథకం దోహదపడుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కుల, మతాలకు అతీతంగా పేదరిక నిర్మూలన కోసం సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఇప్పటికే అన్ని వర్గాల పేదలను ప్రభుత్వం ఆదుకుంటోందని సీఎం చెప్పారు. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో అనేక పథకాలు అమలు చేస్తూ మైనార్టీల్లో పేదరికం, వెనుకబాటుతనాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని కేసీఆర్ గుర్తు చేశారు.

Read also: Jogi Ramesh : పేదల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం చేపడుతుండటం ఒక చరిత్ర

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్ధవంతమైన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని సీఎం అన్నారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు సమానంగా అండగా ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 15 నుంచి బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం కేసీఆర్ సర్కార్ అమలు చేయనుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన కుల వృత్తులకు చెందిన వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ఈ ఏడాది జూన్ 20 నుంచి ఈ పథకం కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్ధవంతమైన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని సీఎం అన్నారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు సమానంగా అండగా ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మైనార్టీల కోసం పలు పథకాలు అమలు చేస్తోంది. షాదీ ముబారక్, విద్యార్థుల విదేశీ విద్యకు రూ. 20 లక్షలు, రంజాన్ కానుకలు, తెలంగాణ అజ్మీర్‌లో రూ. 5 కోట్లతో అతిథి గృహం నిర్మిస్తున్నారు.
Karnataka Congress MLA : సీఎంను ఎలా దించాలో తెలుసు.. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు