NTV Telugu Site icon

TG Budget-2024: నేటి నుంచి బడ్జెట్ సన్నాహక సమావేశాలు..

Tg Budjut 2024

Tg Budjut 2024

TG Budget-2024: నేటి నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ సమావేశాలకు ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆ రోజు నుంచి భేటీ కానున్నారు. ఇవాళ వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేతశాఖల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఇక 21న రెవెన్యూ, గృహనిర్మాణం, ఐఅండ్‌పీఆర్‌, పంచాయతీరాజ్‌, స్త్రీ శిశు సంక్షేమం, వైద్య, ఆరోగ్య శాఖల సమావేశం ఉంటుంది. 22న ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రతిపాదనలపై చర్చ ఉంటుంది. 26న నీటిపారుదల, పౌరసరఫరాలు, అటవీ, దేవాశాఖల సమావేశం.. 27న రవాణా, బీసీ సంక్షేమం, ఎక్సైజ్, టూరిజం శాఖల ప్రతిపాదనలపై చర్చలు జరగనున్నాయి.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని శాఖల ప్రతిపాదనలపై 28 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు ఆయా శాఖల ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనలకు అనుగుణంగా కొత్త పథకాలకు అవసరమైన నిధులు, వాటికి సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని శాఖలకు స్పష్టం చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి సంబంధించి ఆయా శాఖల పనితీరు సూచికల ఆధారంగా నిర్దేశించిన లక్ష్యాల వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే..
Bandi Sanjay : ఎల్లుండి కరీంనగర్ కు బండి సంజయ్ రాక.. తొలి రోజు షెడ్యూల్‌ ఇలా..!