Site icon NTV Telugu

Telangana Govt: ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురికి చోటు.. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఆనేత..!

Telangana Govt

Telangana Govt

Telangana Govt: ప్రభుత్వ సలహాదారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, హరకర వేణుగోపాల్‌లను ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. వీరందరూ.. మంత్రివర్గానికి సలహాదారులుగా పనిచేస్తారు. ఇక హరకార వేణుగోపాల్.. ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్స్, వేం నరేందర్ రెడ్డి.. సీఎం వ్యవహారాలు, షబ్బీర్ అలీ-ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తారు. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మరో సీనియర్ నేత మల్లు రవి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

షబ్బర్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారనే టాక్ వచ్చింది. ఆయన్ను కొన్ని కోటాలో పెద్దల సభకు పంపుతారని, మైనారిటీ కోటాలను మంత్రివర్గంలో తీసుకుంటారని ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన తరుణంలో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అక్కడ పోటీ చేయడంతో టీపీసీసీ చీప్‌గా ఉన్న రేవంత్‌ రంగంలోకి దిగారు. షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం మైనారిటీ కోటాలో ఎమ్మెల్యేలు లేకపోవడంతో రేవంత్ మంత్రివర్గంలో ఆ వర్గానికి ప్రాతినిధ్యం లేదు. దీంతో షబ్బీర్ అలీని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించడంతో మంత్రి పదవి రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Read also: Walnuts Benefits : రోజూ గుప్పెడు వాల్ నట్స్ ను తింటే ఏమౌతుందో తెలుసా?

ఇక వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి మిత్రుడు, సన్నిహితుడు. గతంలో వీరిద్దరూ టీడీపీలో చురుగ్గా పనిచేశారు. 2004-2009 మధ్య వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2007లో ఎమ్మెల్సీగా ఎన్నికైన రేవంత్ రెడ్డి.. ఉభయ సభల్లో చురుగ్గా ఉండే టీడీపీ యువనేతల మధ్య స్నేహం బలపడింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో వేం నరేంద్ర నిర్మించిన రాజకీయ కంచుకోట అయిన మహబూబాబాద్ రిజర్వ్ అయింది. ఆ తర్వాత 2015లో మిత్రుడు వేం నరేందర్‌ను ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నంలో భాగంగానే నామినేటెడ్‌ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్‌సన్‌ వద్దకు రేవంత్‌ రెడ్డి వెళ్లారు. ఆ తర్వాతి కాలంలో రేవంత్ ఎదుర్కొన్న అనేక ఒడిదుడుకుల్లో నరేంద్ర రెడ్డి వెన్నుదన్నుగా నిలిచారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకేసారి కాంగ్రెస్‌లో చేరారు.

ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడి ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆయనకు సముచిత స్థానం దక్కుతుందని అందరూ భావించారు. దీని ప్రకారం కేబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా వేం నరేంద్రరెడ్డిని నియమించారు. హరకర వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు కల్పించింది.
Ration Card: దేశ వ్యాప్తంగా అమల్లోకి ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’

Exit mobile version