NTV Telugu Site icon

Telangana Formation Day Celebrations: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Ntv Live Updats

Ntv Live Updats

Telangana Formation Day Celebrations: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాడి ఇవాళ్టికి పదో ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ.. రాజకీయ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఇటు పార్టీ తరఫున, అటు ప్రభుత్వం తరఫున ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు తరఫున గోల్కొండ కోటలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తుంది. నేటి నుంచి 22వ తేదీ వరకు దశాబ్ది వేడుకలను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలు, ఒక్కో రంగం సాధించిన విజయాలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సంస్మరణ సందర్భంగా తొలిరోజున జాతీయ జెండాల ఆవిష్కరణ, ప్రత్యేక కార్యక్రమాలు నగర వ్యాప్తంగా నిర్వహించనున్నారు.

The liveblog has ended.
  • 02 Jun 2023 12:03 PM (IST)

    309 ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రియల్‌ పార్కులు- మంత్రి కేటీఆర్

    సిరిసిల్ల జిల్లాలో 1803 రైతు కుటుంబాలకు రూ.90.15 కోట్ల రైతుబీమా పరిహారం చెల్లించి ఆదుకున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 57 క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మించాం. సాగు విస్తీర్ణం పెరగడంతో గంభీరావుపేట మండలం నర్మల్‌లో 309 ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రియల్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.

  • 02 Jun 2023 12:02 PM (IST)

    రైతుల సౌకర్యార్థం మరో 5 కమిటీలు- మంత్రి కేటీఆర్

    తెలంగాణ ఏర్పడక ముందు జిల్లాలో 3 వ్యవసాయ కమిటీలు మాత్రమే ఉండగా, రైతుల సౌకర్యార్థం మరో 5 కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. 20 కోట్లతో సిరిసిల్ల సర్దాపూర్ గ్రామంలో 25 ఎకరాల్లో విశాలమైన, అధునాతన మార్కెట్ యార్డు నిర్మించాం. రైతులు తమ పంటలను నేరుగా అమ్ముకునేందుకు వీలుగా సిరిసిల్ల పట్టణంలో 5.15 కోట్లతో రైతుబజార్‌ను నిర్మించాం.

  • 02 Jun 2023 12:01 PM (IST)

    రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం గోడౌన్ల నిర్మాణం-కేటీఆర్

    రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం గోడౌన్ల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ రాకముందు 4200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన వ్యవసాయ గోదాములు 14 మాత్రమే ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిరిసిల్ల జిల్లాలో 33 కోట్లతో 55 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆధునిక గోదాములు నిర్మించారు.

  • 02 Jun 2023 12:00 PM (IST)

    చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆయిల్‌పామ్‌ సాగు- మంత్రి కేటీఆర్‌

    చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆయిల్‌పామ్‌ సాగుకు రాష్ట్ర బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు 292 మంది రైతులు సుమారు వెయ్యి ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.

  • 02 Jun 2023 12:00 PM (IST)

    రైతులకు స్థిరమైన ఆదాయం, మెరుగైన జీవనం- మంత్రి కేటీఆర్

    సాగు నీరు, భూగర్భ జలాలు అసాధారణంగా పెరగడం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో నికర సాగు భూమి 2016లో 1,77,960 ఎకరాల నుంచి 2,40,430 ఎకరాలకు పెరిగింది. రైతుబంధు పథకం ద్వారా నేరుగా 1,130 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశాం. సిరిసిల్ల జిల్లాలో పది విడతల్లో 1,33,658 మంది రైతులు. రైతులకు స్థిరమైన ఆదాయం, మెరుగైన జీవనం అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణలో ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు.

  • 02 Jun 2023 11:59 AM (IST)

    అద్భుతమైన పథకాలు, సంస్కరణలు అమల్లోకి తెచ్చాము- మంత్రి కేటీఆర్

    రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం, నిర్మాణం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు వేదికలు, పంట పొలాల నిర్మాణం. రైతుబంధు సమితి.. దున్నడం మొదలు.. ఇలాంటి అద్భుతమైన పథకాలు, సంస్కరణలు అమల్లోకి తెచ్చామన్నారు.

  • 02 Jun 2023 11:58 AM (IST)

    వ్యవసాయానికి 24 గంటల విద్యుత్- మంత్రి కేటీఆర్

    తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ విధానాలను ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆయా రాష్ట్రాల రైతులు తమ రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి నేడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో చూస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పదేళ్లలో ఆనాటి ప్రభుత్వాలు వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత రంగాలకు సగం నిధులు వెచ్చించాయి. రైతు పాత్రను నింపిన కేసీఆర్ సుపరిపాలనలో రైతుల కళ్లలో పేదరికం తొలగిపోయి ధైర్యం పెరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.

  • 02 Jun 2023 11:57 AM (IST)

    తెలంగాణ ఎనలేని ప్రగతిలో రాజన్న సిరిసిల్ల- మంత్రి కేటీఆర్

    తెలంగాణ ఎనలేని ప్రగతిలో రాజన్న సిరిసిల్ల జిల్లా తన ప్రత్యేకతను నిలుపుకుంటూ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రాథమిక రంగమైన వ్యవసాయం, ఇతర రంగాల అభివృద్ధికి ఆధారం అన్నారు. సుసంపన్నమైన వ్యవసాయానికి తెలంగాణ నేడు దేశానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు.

  • 02 Jun 2023 11:56 AM (IST)

    సంక్షోభ సమయంలోనూ సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణ- మంత్రి కేటీఆర్‌

    సంక్షోభ సమయంలోనూ సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణను కొనసాగిస్తూ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజా సంక్షేమ పథకాలను పెద్దఎత్తున అమలు చేయడం తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమన్నారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.

  • 02 Jun 2023 11:56 AM (IST)

    తెలంగాణ మోడల్‌కు నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు-కేటీఆర్

    కేసీఆర్ మానవతా దృక్పథం, నిర్మాణాత్మక ఆలోచన, దూరదృష్టితో కూడిన ప్రణాళిక, పారదర్శక పరిపాలన.. తెలంగాణ మోడల్‌కు నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్థిక మాంద్యం, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగిందని అన్నారు.

  • 02 Jun 2023 11:55 AM (IST)

    తెలంగాణ సాధన.. దేశం అనుసరించే స్థాయికి చేరింది- మంత్రి కేటీఆర్

    కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్ల స్వల్ప కాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్ర 10వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధన.. దేశం అనుసరించే స్థాయికి చేరిందన్నారు. ఇది ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని అన్నారు.

  • 02 Jun 2023 11:51 AM (IST)

    హుజురాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

    హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యాక్రమంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

  • 02 Jun 2023 11:16 AM (IST)

    డ్రమ్స్‌ కొడుతూ జోష్‌ నింపిన వీ.హనుమంతరావు

    గాంధీ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, త్రివర్ణ పతాకాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ. హనుమంతరావు ఎగురవేశారు. అనంతరం డ్రమ్స్‌ కొడుతూ అందరిలో జోష్ నింపారు వీహెచ్‌. డ్రమ్స్‌ కొడుతున్న వీహెచ్‌ ను చూసి ఉత్సాహంతో స్టెప్పులు వేశారు.

  • 02 Jun 2023 11:06 AM (IST)

    రైతు బంధు పథకం వారి కళ్లను సైతం తెరిపించింది- సీఎం కేసీఆర్‌

    రైతు బంధు పథకం కేంద్ర పాలకుల కళ్లను సైతం తెరిపించిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. కేంద్రం రైతు బంధు పథకంను అనుసరించక తప్పలేదని సీఎం తెలిపారు. తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు... సర్కార్ సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదని ప్రజలు అనుకుంటున్నారని సీఎం అన్నారు.

  • 02 Jun 2023 11:03 AM (IST)

    పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తి- సీఎం కేసీఆర్‌

    పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పైగా పూర్తయ్యాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం జిల్లాలో సీత రామ ప్రాజెక్ట్ పనులు తుది దశకు చేరుకుందని తెలిపారు. త్వరలో ప్రాజెక్టు పూర్తి అవుతుందని సీఎం అన్నారు.

  • 02 Jun 2023 11:02 AM (IST)

    తెలంగాణ లో పవర్ హాలిడే, క్రాప్ హాలిడే లు లేవు- సీఎం కేసీఆర్‌

    తెలంగాణ లో పవర్ హాలిడే, క్రాప్ హాలిడే లు లేవని సీఎం కేసీఆర్‌ అన్నారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున పవర్ హాలిడే ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్రం హర్ ఘర్ జల్ యోజన పథకం నూటికి నూరు శాతం లక్ష్యాన్ని చేరుకోలేదన్నారు. స్వచ్ఛ మైన తాగు నీరు అందించడం లో మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ మూడవ స్థానంలో ఉందన్నారు.

  • 02 Jun 2023 11:00 AM (IST)

    జూన్‌ 24 నుంచి పోడు పట్టాల పంపిణీ- సీఎం కేసీఆర్‌

    జూన్‌ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. అటవీ భూములపై ఆధారపడిన ఒక లక్షా యాభైవేల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తుందన్నారు. దీనికి రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటుందన్నారు.

  • 02 Jun 2023 10:58 AM (IST)

    బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్ధికసాయం- కేసీఆర్‌

    దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్ధికసాయం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాల వారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. అదేవిధంగా గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేసే కార్యక్రమం దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభమవుతుందన్నారు.

  • 02 Jun 2023 10:56 AM (IST)

    సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం- సీఎం కేసీఆర్‌

    ప్రతి నియోజక వర్గంలో గృహ లక్ష్మి స్కీమ్ కింద 3 లక్షలు, మూడు వేల మందికి డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశామన్నారు.

  • 02 Jun 2023 10:47 AM (IST)

    గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్

    తెలంగాణ దశాబ్ది వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సచివాలయానికి బయలుదేరారు. సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు ప్రగతి భవన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

  • 02 Jun 2023 10:46 AM (IST)

    ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి కేటీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

  • 02 Jun 2023 10:45 AM (IST)

    అమరవీరులను స్మరిస్తూ బావోద్వేగం- గవర్నర్ తమిళి సై

    అమరవీరులను స్మరిస్తూ బావోద్వేగంతో గవర్నర్ తమిళి సై ప్రసంగించారు. మొత్తం ప్రసంగాన్ని తెలుగులోనే గవర్నర్‌ మాట్లాడారు. అనేక పోరాటాల వల్ల సాధించుకున్న తెలంగాణకు గవర్నర్ గా రావడం దేవుని ఆశీర్వాదమన్నారు. ఆధునిక ప్రపంచంలో తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. తెలంగాణ అమరవీరుల కు పేరుపేరునా ధన్యవాదాలని గవర్నర్‌ తెలిపారు.

  • 02 Jun 2023 10:45 AM (IST)

    హైదరాబాద్ అంతర్జాతీయంగా పేరు సంపాదించింది- గవర్నర్

    హైదరాబాద్ అంతర్జాతీయంగా పేరు సంపాదించిందని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. కేవలం ఒక్క చోటే కాకుండ రాష్ట్ర వ్యాప్తంగా అభివృధి జరుగుతునే అభివృధి జరిగినట్లు అన్నారు. ఈ దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ అందరికి పిలుపునిస్తున్నామని తెలిపారు. జై తెలంగాణ అనేది ఒక స్లోగన్ కాదు.. ఒక ఆత్మ గౌరవమన్నారు. తెలంగాణ పోరాట యోధులకి నా ధన్యవాదాలు తెలిపారు.

  • 02 Jun 2023 10:44 AM (IST)

    కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరణన- పోచారం శ్రీనివాస రెడ్డి

    తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్థూపానికి, కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.

  • 02 Jun 2023 10:43 AM (IST)

    ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణా ప్రజలకి శుభాకాంక్షలు- గవర్నర్

    ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణా ప్రజలకి శుభాకాంక్షలు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. ఈ మహోన్నత పోరాటంలో ఎంతొ మంది యువకులు, అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన ఈ తెలంగాణ రాష్టం అన్నిట్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నామని తెలిపారు. నాకు చాలా ఆనందంగా ఉంది.. ఇవాళ 1969 తెలంగాణ ఉద్యమ కారులను కలిశానని గవర్నర్‌ అన్నారు.

  • 02 Jun 2023 10:42 AM (IST)

    జై తెలంగాణ అంటే స్లోగన్ ఒక్కటే కాదు.. ఆత్మ గౌరవ నినాదం- గవర్నర్‌

    జై తెలంగాణ అంటే స్లోగన్ ఒక్కటే కాదు.. ఆత్మ గౌరవ నినాదమని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై అన్నారు. అమరవీరులందరికీ నా జోహార్లు తెలిపారు. నా జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసమే అన్నారు. దేవుడు నన్ను తెలంగాణ కు పంపడం గొప్ప అదృష్టమన్నారు. నేను మీతో ఉన్నాను. మీరు నాతో ఉన్నారని గవర్నర్‌ అన్నారు.

  • 02 Jun 2023 10:40 AM (IST)

    తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే కాదు- గవర్నర్‌

    తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే కాదన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై. రాజ్ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో గవర్నర్‌ పాల్గొన్నారు. జెండా వందనం చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. కొంత మంది అభివృద్ధి కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అయితేనే సంపూర్ణ అభివృద్ధి అనిపించుకుంటుందన్నారు. వచ్చే సంవత్సరం నాటికి దేశంలో తెలంగాణ నంబర్1 కావాలని అన్నారు.

  • 02 Jun 2023 10:34 AM (IST)

    సీఎం కేసీఆర్‌ దీక్షాదక్షతలో మన రాష్ట్రం ముందడుగు- మంత్రి హరీశ్‌

    మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశానికే దశ, దిశ నిర్దేశించేలా ఉన్నాయని మంత్రి హరీష్ రావ్‌ అన్నారు. సర్వతోముఖాభివృద్ధిగా నిలిచింది.. ఇది మనమంతా గర్వపడాల్సిన సందర్భమన్నారు మంత్రి. సీఎం కేసీఆర్‌ దీక్షాదక్షతలో మన రాష్ట్రం ముందడుగు వేస్తుందన్నారు. మన సిద్దిపేట జిల్లా సైతం ఎన్నో కీర్తికిరీటాలను సొంతం చేసుకుందని తెలిపారు. తొమ్మిదేళ్ల క్రితం నాటి అచేతనావస్థలు... ఇప్పటి అద్భుతమైన స్థితిగతులను మననం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి తెలిపారు.

  • 02 Jun 2023 10:34 AM (IST)

    14 గేళ్ల పోరాటం, తొమ్మిదేళ్ల సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం- మంత్రి హరీష్

    14 గేళ్ల పోరాటం, తొమ్మిదేళ్ల సంకల్పంతో నేడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని మంత్రి హరీష్ అన్నారు. జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం అంటూ తొమ్మిది సంవత్సరాల ప్రగతియాత్రను పూర్తిచేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామన్నారు. పసి రాష్ట్రంగా అవతరించిన పదేళ్లలోనే తెలంగాణలో నూరేళ్ల అభివృద్ధిని సాకారం చేసుకున్నామని చెప్పడం గర్వంగా ఉందన్నారు.

  • 02 Jun 2023 10:28 AM (IST)

    సీఎం కేసీఆర్‌ దీక్షాదక్షతలో మన రాష్ట్రం ముందడుగు- మంత్రి హరీశ్‌

    మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశానికే దశ, దిశ నిర్దేశించేలా ఉన్నాయని మంత్రి హరీష్ రావ్‌ అన్నారు. సర్వతోముఖాభివృద్ధిగా నిలిచింది.. ఇది మనమంతా గర్వపడాల్సిన సందర్భమన్నారు మంత్రి. సీఎం కేసీఆర్‌ దీక్షాదక్షతలో మన రాష్ట్రం ముందడుగు వేస్తుందన్నారు. మన సిద్దిపేట జిల్లా సైతం ఎన్నో కీర్తికిరీటాలను సొంతం చేసుకుందని తెలిపారు. తొమ్మిదేళ్ల క్రితం నాటి అచేతనావస్థలు... ఇప్పటి అద్భుతమైన స్థితిగతులను మననం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి తెలిపారు.

  • 02 Jun 2023 10:21 AM (IST)

    సిద్దిపేటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు- మంత్రి హరీశ్‌ రావు

    సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి అమరులను స్మరిస్తూపానికి మంత్రి నివాళులు అర్పించారు.

  • 02 Jun 2023 10:15 AM (IST)

    కాళేశ్వరం నీళ్లతో మెదక్ జిల్లా సస్యశ్యామలం- మంత్రి తలసాని

    కాళేశ్వరం నీళ్లతో మెదక్ జిల్లా సస్యశ్యామలం అవుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ ఆలోచనతో రైతు బంధు పథకం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిందన్నారు.

  • 02 Jun 2023 10:14 AM (IST)

    70 ఏండ్ల లో జరగని అభివృద్ధి ఈ 9ఏళ్ళలో జరిగింది - మంత్రి తలసాని

    70 ఏండ్ల లో జరగని అభివృద్ధి ఈ 9 ఏళ్ళలో జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కరువు కటకలతో అలమటించిన తెలంగాణ నేడు సస్యశ్యామలం అయిందన్నారు.

  • 02 Jun 2023 10:13 AM (IST)

    తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది- మంత్రి తలసాని

    తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమ పథకాలు అమలుపరిస్తూ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందని చెప్పుకునే స్థాయికి పోవడం గర్వకారణమన్నారు.

  • 02 Jun 2023 10:10 AM (IST)

    మెదక్ కలెక్టరేట్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

    మెదక్ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్. రాజర్షి షా,ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పాల్గొన్నారు.

  • 02 Jun 2023 09:58 AM (IST)

    ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా భారత్ మారింది- బండి సంజయ్

    కేంద్రం నిధులతోనే రాష్ట్రం నడుస్తుందని ప్రజలు బతుకుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాలుగు లక్షల కోట్ల రూపాయల నిధులను తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి కేటాయించిందన్నారు. ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా భారత్ మారిందని బండి సంజయ్ అన్నారు.

  • 02 Jun 2023 09:55 AM (IST)

    బీజేపీ కృషి ఫలితంతోనే తెలంగాణ రాష్ట్రం- బండి సంజయ్

    బీజేపీ కృషి ఫలితంతోనే రాష్ట్రం ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 1400 కోట్ల అమరుల బలిదానాలతో ఈ తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుందని అన్నారు. అన్ని అంశాల్లో కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తుందన్నారు.

  • 02 Jun 2023 09:54 AM (IST)

    సంవత్సరం ముందే ఫీజ్ రీయంబర్మెంట్స్ చేస్తాం- బండి సంజయ్

    సంవత్సరం ముందే ఫీజ్ రీయంబర్మెంట్స్ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 25వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.  ప్రభుత్వం ఏర్పడ్డాక పేదలకు ఉచిత విద్యా వైద్యం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చేసిన యాత్రలు చేసారని అన్నారు.

  • 02 Jun 2023 09:52 AM (IST)

    ఆశయాలకు భిన్నంగా తెలంగాణలో పాలనా సాగుతుంది- బండిసంజయ్

    ఆశయాలకు భిన్నంగా తెలంగాణలో పాలనా సాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.  నలుగురి వల్ల దేశంలో రాష్ట్రం నవ్వులపాలయ్యిందని తెలిపారు. మహిళలు, యువత, రైతులు ఎవరిని కలిసిన ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నాం.. ఏం జరుగుతుంది అని అడుగుతున్నారని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజల్లోకి వెళ్ళామన్నారు.  బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. అందరికి ఉచిత విద్య అందిస్తామన్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో ఇప్పుడు కనీసం చాక్ పీస్ కూడా లేని పరిస్థితి ఉందని బండి సంజయ్ తెలిపారు.

  • 02 Jun 2023 09:49 AM (IST)

    బలిదానాలు వద్దు అని చెప్తు యువతకు ధైర్యాన్ని ఇచ్చింది సుష్మాస్వరాజ్- బండిసంజయ్

    రాష్ట్ర ఏర్పాటు కోసం అసువులు బాసిన అమరులను స్మరించుకుంటున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గోల్కొండ కిల్లా మీద కేంద్రం ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి జెండా ఎగరవేశారు. పార్లమెంట్ లో సుష్మాస్వరాజ్ తెలంగాణ కోసం మాట్లాడారని తెలిపారు. బలిదానాలు వద్దు అని చెప్తు యువతకు ధైర్యాన్ని ఇచ్చింది సుష్మాస్వరాజ్ అని బండి సంజయ్ అన్నారు.

  • 02 Jun 2023 09:46 AM (IST)

    బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

    బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ శుభకాంక్షలు తెలిపారు. మర్రి శశిధర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.

     

  • 02 Jun 2023 09:40 AM (IST)

    సిరిసిల్ల లోని అమరవీరుల స్థూపానికి మంత్రి కేటీఆర్ నివాళులు

    రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. సిరిసిల్ల లోని అమరవీరుల స్థూపం వద్ద మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. మంత్రి వెంట పలువురు బీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

  • 02 Jun 2023 09:38 AM (IST)

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందు ఎంఎల్ఏ హరిప్రియ, జిల్లా కలెక్టర్, అనుదీప్, ఎస్పీ వినీత్ పాల్గొన్నారు.

  • 02 Jun 2023 09:36 AM (IST)

    సంగారెడ్డి కలెక్టరేట్ లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

    సంగారెడ్డి కలెక్టరేట్ లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం మంత్రి స్వీకరించారు.

  • 02 Jun 2023 09:35 AM (IST)

    సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

    సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అమర వీరుల స్థూపానికి మంత్రి జగదీష్ రెడ్డి నివాళులు అర్పించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి స్వీకరించారు. శాంతి కపోతాలను మంత్రి ఎగుర వేశారు.

  • 02 Jun 2023 09:21 AM (IST)

    పెద్దపల్లి జిల్లాలో మంథనిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

    పెద్దపల్లి జిల్లాలో మంథనిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు జాతీయ జెండాను ఎగురవేశారు. మంథని రెవెన్యూ డివిజన్ కార్యాలయ ఆవరణలో ఆర్డీఓ వీర బ్రహ్మచారి, తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ బండి ప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కారించారు.

  • 02 Jun 2023 09:18 AM (IST)

    జగిత్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు- మంత్రి కొప్పుల ఈశ్వర్

    జగిత్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అనంతరం జాతీయ జెండాను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష, ఎస్‌పి భాస్కర్, జగిత్యాల కోరుట్ల శాసన సభ్యులు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్మన్ దావా వసంత పాల్గొన్నారు.

  • 02 Jun 2023 09:15 AM (IST)

    కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి గంగుల

    తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంత్రి గంగుల కమలాకర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని మంత్రి గంగుల స్వీకరించారు. ఈకార్యక్రమంలో.. ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, జడ్పి ఛైర్మెన్ విజయ,, మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.

  • 02 Jun 2023 09:10 AM (IST)

    ఖమ్మం కలెక్టర్ కార్యాలయం లో జెండా ఆవిష్కరణ చేసిన మంత్రి పువ్వాడ

    ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో ఎం.ఎల్.ఏ సండ్ర వెంకట వీరయ్య, రాముల నాయక్, జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్, ఎం.ఎల్.సి తాత మధు, కార్పొరేషన్ చైర్మన్ నీరజ్ కలెక్టర్ గౌతమ్, సిపి విష్ణు వారియర్ పలువురు పాల్గొన్నారు.

  • 02 Jun 2023 09:08 AM (IST)

    సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాని ఆవిష్కరించిన హరీష్ రావు

    సిద్ధిపేట జిల్లా  మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాని మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.  క్యాంపు కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం మంత్రి హరీశ్ రావు స్వీకరించారు. రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి అమరులను స్మరిస్తూ మంత్రి నివాళులు అర్పించారు.