Site icon NTV Telugu

మ‌రోసారి ఎంసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు..

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా కొన్ని ప‌రీక్షలు ర‌ద్దు కాగా.. మ‌రికొన్ని పోటీ ప‌రీక్షల‌ను వాయిదా వేస్తూ వ‌స్తోంది తెలంగాణ ప్రభుత్వం.. లాక్‌డౌన్ నేప‌థ్యంలోనూ మ‌రికొన్ని ప‌రీక్షలు వాయిదా ప‌డుతున్నాయి.. ఇక‌, ఆగస్ట్‌లో జ‌ర‌గ‌నున్న ఎంసెట్ ప‌రీక్షల‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువును మ‌రోసారి పొడిగించింది ప్రభుత్వం.. ఎంసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఎలాంటి అప‌రాద రుసుం లేకుండా ఈ నెల 8వ తేదీ వరకు స్వీక‌రించ‌నున్నట్టు ఎంసెట్ క‌న్వీన‌ర్ ప్రక‌టించారు.. లాక్‌డౌన్ కారణంగా.. విద్యార్థుల విజ్ఞప్తి మేర‌కు ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ వెల్లడించారు.

కాగా.. ఇటీవలే ఎంసెట్ నిర్వహణ తేదీలు ఖరారు చేశారు తెలంగాణ ప్రభుత్వం. ఆగస్టు 3న ఈసెట్, ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఎంసెట్‌ (ఇంజినీరింగ్), ఆగస్టు 9, 10 తేదీల్లో ఎంసెట్ (అగ్రికల్చర్, మెడికల్) నిర్వహించనుండగా.. ఆగస్టు 11-14 వరకు పీజీ ఈ సెట్, ఆగస్టు 19,20 తేదీల్లో ఐ-సెట్, ఆగస్టు 23వ తేదీన లాసెట్, ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్, జులై 17న పాలిసెట్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

Exit mobile version