Site icon NTV Telugu

TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. మే 25 ఉదయం 11 గంటలకు విడుదల

Telangana Eamcet

Telangana Eamcet

Telangana EAMCET: తెలంగాణలో ఎంసెట్ ఫలితాల ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఎంసెట్ ఫలితాలను మే 25న గురువారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూ-హైదరాబాద్‌ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి తదితరులు విడుదల చేయనున్నారు.

Read also: Cannes Film Festival: కేన్స్ ఫెస్టివల్‌లో షాకింగ్ ఘటన.. ఒంటిపై రక్తం పోసుకొని..

మే 12 నుంచి 15 వరకు ఆరు బ్యాచ్‌లుగా ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు నిర్వహించగా.. ఇటీవల ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్‌ షీట్లు విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తాజా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు లక్ష మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఎంసెట్‌లో అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల ఫలితాల ర్యాంకులు, మార్కులు విడుదల చేస్తారు.ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. మెడికల్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంకర్ల వివరాలను కూడా వెల్లడించనున్నారు. EAMCET ఫలితాల కోసం eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో లాగిన్ చేయవచ్చు.
Love Tragedy: ప్రేమ పేరుతో మోసం చేసిందని.. ఇంట్లోకి చొరబడి..

షెడ్యూల్ ప్రకారం అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు మే 10, 11 తేదీల్లో, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12, 13, 14న జరగాయి. JNTU హైదరాబాద్ MSET నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. TS EAMCET కోసం 3,20,384 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. మే 10, 11 తేదీల్లో నిర్వహించే ఏఎం స్ట్రీమ్ పరీక్షకు మొత్తం 1,14,981 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే 12, 13, 14 తేదీల్లో జరగనున్న ఇంజినీరింగ్ పరీక్షకు 2,05,031 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. తెలంగాణలోని 104 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 33 కేంద్రాల్లో అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో కంటే కొత్తగా 28 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించారు.
IT Raids: హైదరాబాదులో 30 చోట్ల ఏకకాలంగా ఐటీ సోదాలు

Exit mobile version