Site icon NTV Telugu

ఫుడ్ డెలివరీ సేవలకు ఆటంకం కలిగించొద్దు : డిజిపి

తెలంగాణలో పోలీసులు రాష్ట్రంలో కఠిన ఆంక్షలతో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అనవసరంగా ఎవరైనా రోడ్డు పైకి వస్తే వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న ఫుడ్ డెలివరీ బాయ్స్ బైక్స్ ను కూడా సీజ్ చేసారు పోలీసులు. కానీ తమకు ఎటువంటి సూచనలు లేకుండా పోలీసులు ఇలా చేస్తున్నారు అని డెలివరీ బాయ్స్ అందాలని చేసారు. అయితే తాజాగా ఫుడ్ డెలివరీ సేవలకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దు అని తెలంగాణ డిజిపి తెలిపారు. నిత్యావసర, ఫుడ్ డెలివరీ సేవలకు, మరియు ఈ-కామర్స్ ద్వారా జరిగే సేవలకు ఎటువంటి ఆటకం కలగకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా, పోలీస్ ఉన్నతాధికారులు మరియు ఇతర భాగస్వామ్య ప్రతినిధులతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు డిజిపి పేర్కొన్నారు.

Exit mobile version