NTV Telugu Site icon

Telangana Decade Celebrations LIVE: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు లైవ్‌ అప్‌డేట్స్

Revanthreddy

Revanthreddy

Telangana Decade Celebrations LIVE: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్రీయ గీతం జయజయహే తెలంగాణ గేయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జూన్‌ 2 ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ప్రజల ముందుకు వచ్చింది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన దశాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ గీతాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ పాటను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన పాటను విడుదల చేశారు. ఈ పాటను అందెశ్రీ రచించగా.. కీరవాణి సంగీతం అందించారు. పాట విడుదల సందర్భంగా రచయిత అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు.

The liveblog has ended.
  • 02 Jun 2024 11:50 AM (IST)

    ‘బస్ కా పయ్యా నహీ ఛలేగా’ సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరి- సజ్జనార్

    తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ స‌జ్జ‌నార్ అన్నారు. ‘బస్ కా పయ్యా నహీ ఛలేగా’ నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

  • 02 Jun 2024 11:15 AM (IST)

    ఏ జాతికైనా తన సంస్కృతే తన అస్తిత్వం- రేవంత్ రెడ్డి

    ఏ జాతికైనా తన సంస్కృతే తన అస్తిత్వం. ఆ సంస్కృతిని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. బోనం నుండి బతుకమ్మ వరకు... సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర ఉద్యమం వరకు మన సంస్కృతి, మన చరిత్ర గొప్పవి. సమ్మక్క సారలమ్మ నుండి జోగులాంబ వరకు... భద్రాద్రి రాముడు నుండి కొమురం భీం వరకు, అమరుల త్యాగాలు, హక్కుల ఉద్యమాల వంటి వాటితో తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ సంస్కృతికి, చరిత్రకు పునరుజ్జీవనం జరగాలి. తెలంగాణ వచ్చి పదేండ్లైన ఇప్పటికీ మనకు రాష్ట్ర గీతం లేదన్నారు.

  • 02 Jun 2024 11:07 AM (IST)

    అందరికీ మరొక్కసారి తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు-రేవంత్

    హైదరాబాద్ మన బ్రాండ్. ప్రపంచ నెంబర్ వన్ బ్రాండ్ గా హైదరాబాద్ ఎదగాలి. తెలంగాణను ప్రపంచానికి డెస్టినేషన్ గా మార్చాలన్న తపన ఉంది. దీనికి నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులతో పాటు... రాజకీయ, పరిపాలన, పత్రికా, న్యాయ, సామాజిక వ్యవస్థల సహకరం కావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరు, ప్రతి క్షణం ఆలోచన చేయాలని... ప్రజా ప్రభుత్వానికి మీ సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటూ...అందరికీ మరొక్కసారి తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

  • 02 Jun 2024 11:06 AM (IST)

    ఏం తక్కువ తెలంగాణకు- రేవంత్

    ఒకనాడు పొట్ట చేత పట్టి పట్నంకు వచ్చిన యువత... రేపటి నాడు ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలి. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి. మనకు శక్తి ఉంది, సత్తువుంది... తెలివి ఉంది, తెగింపు ఉంది, త్యాగాల చరిత్ర ఉంది. ఏం తక్కువ తెలంగాణకు.

  • 02 Jun 2024 11:06 AM (IST)

    పైరులతో, పాడి పంటలతో, రైతుల మొఖాలలో చిరునవ్వు- రేవంత్

    తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలి. తెలంగాణ విజయ పతాక దేశ విదేశాలలో సగర్వంగా ఎగరాలి. “పల్లె కన్నీరు పెడుతోందో...” అని ఒకనాడు ఆవేదనతో పాడిన తెలంగాణ పల్లెలు ఇకపై పచ్చని పైరులతో, పాడి పంటలతో, రైతుల మొఖాలలో చిరునవ్వులతో వెలగాలి.

  • 02 Jun 2024 11:05 AM (IST)

    హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది- రేవంత్

    తెలంగాణ ముందు పలు సవాళ్లు కూడా ఉన్నాయి. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. పదేండ్లైనా నీటి పంపకాలు జరగలేదు. కేంద్రం పై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకుని, సాగునీటి ప్రణాళికలు సమర్ధవంతంగా అమలు చేసుకోవాలన్నది ప్రజా ప్రభుత్వ ఆలోచన. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది. ఆంధ్రప్రదేశ్ తో ఆస్తుల విభజనకు సంబంధించి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటాం.

  • 02 Jun 2024 11:04 AM (IST)

    గ్యాస్ బండ ను కేవలం 500 రూపాయలకే ఇచ్చే పథకం- రేవంత్

    మహాలక్ష్మీ పథకం ద్వారా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నది మా సంకల్పం. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం. విద్యార్థుల యూనిఫార్మ్స్ కుట్టే ఆర్డర్ మహిళా సంఘాలకే అప్పగించాం. గ్యాస్ బండ ను కేవలం 500 రూపాయలకే ఇచ్చే పథకాన్ని ప్రారంభించాం.

  • 02 Jun 2024 11:03 AM (IST)

    దావోస్ పర్యటనలో భాగంగా 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు-రేవంత్

    దావోస్ పర్యటనలో భాగంగా 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒకరికార్డు. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన కార్యచరణ మొదలుపెట్టాం. తద్వారా మన యువత ఉపాధి, ఉద్యోగ కల్పనకు ఈ ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది.

  • 02 Jun 2024 11:03 AM (IST)

    రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది- రేవంత్

    రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ విషయంలో ఎవరికీ సందేహాలు అవసరం లేదు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి 6 న అత్యధికంగా 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాం. రికార్డు సృష్టించాం. పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం.

  • 02 Jun 2024 11:02 AM (IST)

    ధరణి పోర్టల్ పై స్పెషల్ డ్రైవ్ పెట్టి సమస్యలు పరిష్కరిస్తున్నాం- రేవంత్

    నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాం. వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. ధరణి పోర్టల్ పై స్పెషల్ డ్రైవ్ పెట్టి సమస్యలు పరిష్కరిస్తున్నాం.

  • 02 Jun 2024 11:02 AM (IST)

    ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇచ్చాం- రేవంత్ రెడ్డి

    ఇటీవల అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇచ్చాం. ధాన్యం సేకరణ కోసం 7,245 కేంద్రాలు తెరిచాం. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యం కొంటున్నాం. తరుగు విషయంలో రైతు నష్టపోకుండా చూస్తున్నాం.

  • 02 Jun 2024 11:01 AM (IST)

    రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుంది- రేవంత్ రెడ్డి

    రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం ఇది. గతంలో రైతుకు ఉచిత విద్యుత్, రుణమాఫీ చేసిన చరిత్ర మాది. ఆ ట్రాక్ రికార్డును ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తోంది. రైతుకు ఆర్థిక సాయం పథకంలో భాగంగా 69 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం 7,500 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశాం.

  • 02 Jun 2024 11:01 AM (IST)

    పేదల కోసం 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నాం- రేవంత్ రెడ్డి

    రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. ఈ ఒక్క ఏడాడే 22,500 కోట్ల రూపాయలు వెచ్చింది... పేదల కోసం 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవ్వబోతున్నాం. ఇంటి స్థలం లేని వారికి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నామన్నారు.

  • 02 Jun 2024 11:00 AM (IST)

    గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం- రేవంత్ రెడ్డి

    యువత ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. 70 రోజుల్లోనే 30 వేల మంది యువతకు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ నెల తొమ్మిదిన ప్రాథమిక పరీక్ష జరగబోతోంది. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చాం. వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచాం. ప్రభుత్వంలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.

  • 02 Jun 2024 11:00 AM (IST)

    48 గంటల్లో రెండు గ్యారెంటీలు- సీఎం రేవంత్ రెడ్డి

    అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టాం. ఆడబిడ్డలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. పైసా ఖర్చు లేకుండా ఆడబిడ్డలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా వెళ్లే అవకాశం ఈ పథకం కల్పిస్తోంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచామన్నారు.

  • 02 Jun 2024 10:50 AM (IST)

    ప్రపంచ నెంబర్ వన్ బ్రాండ్ గా హైదరాబాద్ ఎదగాలి - రేవంత్ రెడ్డి

    ప్రపంచ నెంబర్ వన్ బ్రాండ్ గా హైదరాబాద్ ఎదగాలని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను ప్రపంచానికి డెస్టినేషన్ గా మార్చాలన్న తపన ఉందన్నారు. దీనికి నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులతో పాటు... రాజకీయ, పరిపాలన, పత్రికా, న్యాయ, సామాజిక వ్యవస్థల సహకరం కావాలన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరు, ప్రతి క్షణం ఆలోచన చేయాలని... ప్రజా ప్రభుత్వానికి మీ సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటున్నామన్నారు.

  • 02 Jun 2024 10:48 AM (IST)

    పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర గీతం విడుదల చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి.

    పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను సీఎం రేవంత్‌ రెడ్డి విడుదల చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌ పార్టీల నేతలు హాజరయ్యారు. వేడుకలకు అమరుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆహ్వానించింది. పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీఎస్, డీజీపీ అధికారులు స్వాగతం పలికారు. పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరణ చేశారు.

  • 02 Jun 2024 10:46 AM (IST)

    ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను నిజం చేశాం- సోనియా గాంధీ

    పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో సోనియా గాంధీ పంపిన వీడియో క్లిప్ మెస్సేజ్ ను ప్లే చేశారు. తెలంగాణ అమర వీరులకు ఆమె శ్రద్ధాంజలి తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను నిజం చేశామని సోనియమ్మ అన్నారు. తెలంగాణ ప్రజలు పదేళ్లుగా తనను ఎంతో గౌరవించారని ఆమె గుర్తు చేసుకుంది.

  • 02 Jun 2024 10:46 AM (IST)

    పాట విడుదల సందర్భంగా రచయిత అందెశ్రీ భావోద్వేగం

    తెలంగాణ రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' పాటను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన పాటను విడుదల చేశారు. ఈ పాటను అందెశ్రీ రచించగా.. కీరవాణి సంగీతం అందించారు. పాట విడుదల సందర్భంగా రచయిత అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు.

  • 02 Jun 2024 10:45 AM (IST)

    తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ వీడియో సందేశం..

    రాష్ట్రం అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర కల నిజం చేసుకొని 10ఏళ్లు అవుతున్న క్రమంలో ఆమె అమరవీరుల త్యాగాన్ని స్మరించుకున్నారు.

  • 02 Jun 2024 10:42 AM (IST)

    నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

    నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయం సముదాయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు.

  • 02 Jun 2024 10:40 AM (IST)

    తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా?- రేవంత్ రెడ్డి

    తెలంగాణ ప్రదాత, మనకు మాతృ సమానురాలైన శ్రీమతి సోనియాగాంధీని ఈ పండుగకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాం. ఏ హెూదాలో సోనియాగాంధీ గారి ని ఆహ్వానించారని అడుగుతున్నారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హెూదా కావాలా?! తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా?! ఏ హెదా ఉందని, ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మనం జాతిపితగా గుర్తించుకున్నాం?! తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు శ్రీమతి సోనియాగాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి, గౌరవిస్తుంది. ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాలకు అతీతం అన్నారు.

  • 02 Jun 2024 10:37 AM (IST)

    రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

    తెలంగాణా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలుపెరుగని పోరాటాలు, బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఈ సంద‌ర్భంగా వారు చేసిన సేవ‌ల‌ను గుర్తు చేశారు.

  • 02 Jun 2024 10:33 AM (IST)

    హనుమకొండలో సోనియా చిత్రపటానికి పాలాభిషేకం

    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హనుమకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరగాయి. జాతీయ పథకాన్ని ఎగరవేసి సోనియా చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు.

  • 02 Jun 2024 10:31 AM (IST)

    నిర్మల్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన కలెక్టర్..

    తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్బంగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ జెండా ఆవిష్కరించారు. అదనపుకలెక్టర్లు ఫైజాన్అహ్మద్, కిషోర్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు బుక్స్ అందజేశారు.

  • 02 Jun 2024 09:30 AM (IST)

    దశాబ్ది ఉత్సవాలు పండగలా జరుగుతున్నాం - కేటీఆర్

    సీఎం రేవంత్‌కు అవగాహన, పరిపక్వత లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న దశాబ్ది ఉత్సవాలు పండగలా జరుగుతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న చరిత్ర, త్యాగాల గురించి రేవంత్ రెడ్డికి తెలియదన్నారు.
    ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ పెట్టిన మెసేజ్‌లో కనీసం జై తెలంగాణ అనని ఒక మూర్ఖుడుకి కేసీఆర్‌ గురించి, తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

  • 02 Jun 2024 08:00 AM (IST)

    గాంధీభవన్‌లో ఘనంగా తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు..

    గాంధీభవన్‌లో తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. జాతీయ జెండాను వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎగరేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. గన్ పార్క్ వరకు ర్యాలీగా కాంగ్రెస్ శ్రేణులు వెళ్లనున్నారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్ నేతలు నివాళులు అరిపించనున్నారు.

Show comments