కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కరోనా పుట్టినిల్లు చైనాలో సైతం కరోనా కేసులు భారీగా నమోదువుతుండడంతో కఠిన లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేశారు. దీంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే భారత్‌లో కూడా థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటు ఫోర్త్ వేవ్ వచ్చిన ఎదుర్కొనగలమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణలో 26,126 కరోనా పరీక్షలు నిర్వహించగా, 459 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 232 కొత్త కేసులు, రంగారెడ్డి జిల్లాలో 60, సంగారెడ్డి జిల్లాలో 54, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28 చొప్పున కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 247 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,99,991 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,91,708 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
