NTV Telugu Site icon

Telangana Corona Bulletin : కొత్తగా 311 కేసులు..

గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గడం లేదు. కరోనా కట్టడికి అగ్ర దేశమైన అమెరికా సైతం కోవిడ్ టీకాలపైనే ఆధారపడింది. అయితే ఇప్పటికే కరోనా టీకాలు ఆయా దేశాలు విస్తృతంగా చేపట్టాయి. అయితే ఫ్రాన్స్ వంటి దేశాల్లో 75శాతం కరోనా టీకాలు పంపిణీ జరిగినా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ప్రస్తుతం భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది.

తాజాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 35,837 కరోనా పరీక్షలు నిర్వహించగా, 311 మందికి పాజిటివ్ అని నిర్ధారణైనట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క జీహెచ్ఎంసీలోనే 90 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 16, మంచిర్యాల జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 614 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,88,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,79,893 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,092 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,111కి పెరిగింది.