NTV Telugu Site icon

తెలంగాణ కరోనా బులిటెన్‌.. కొత్త కేసులెన్నంటే..?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి సృష్టించిన అల్లకల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు బయట పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా తెలంగాణలో 33,226 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 151 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. గడిచిని 24 గంటల్లో ఇద్దరు కరోనా బారినపడి మృతి చెందగా.. 190 మంది కరోనా నుంచి కొలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,838 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 6,72,203 మంది కరోనా బారినపడగా.. 6,64,402 మంది కరోనా నుంచి కొలుకున్నారు. 3,963 మంది కరోనాతో మరణించారు.