దేశ రాజధాని ఢిల్లీలో జరిగే రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని.. మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు గ్రాంట్ ఇవ్వాలని, మిషన్ భగీరథకు రూ.19,500 కోట్లు గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని.. వీటిని పూర్తి చేసినా కేంద్రం నిధులు ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపించారు. కేంద్రం వైఖరికి నిరసనగానే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడం లేదని కేసీఆర్ వివరణ ఇచ్చారు.
దేశంలో ఉచితాలను బంద్ చేయాలని కొత్త పంచాయతీ పెట్టారని.. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ ఇవ్వడం ఉచితమా? రైతులకు ఆసరాగా ఉంటుందని రైతు బంధు ఇవ్వడం ఉచితమా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఉచితాలు తప్పు అయితే.. NPAలకు ఎందుకు ఇస్తున్నారని నిలదీశారు. దేశంలో NPAల పేరుతో బిగ్ స్కామ్ నడుస్తోందని కేసీఆర్ ఆరోపించారు.