Site icon NTV Telugu

మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్

మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. చిరంజీవి కరోనా బారిన పడటంతో ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కరోనా నుంచి చిరంజీవి త్వరగా కోలుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. కాగా తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకోగా.. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని బుధవారం నాడు ట్విటర్‌ ద్వారా చిరంజీవి స్వయంగా వెల్లడించారు. తాను హోమ్ క్వారంటైన్‌లోనే ఉన్నట్లు చెప్పారు.

Read Also: ‘శ్యామ్ సింగ రాయ్’ ఖాతాలో గ్లోబల్ రికార్డు

మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకడం ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ఆయన్ను పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ కూడా చిరంజీవి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు. అటు మెగాస్టార్ అభిమానులు కూడా చిరు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉండగా… గాడ్‌ఫాదర్, భోళాశంకర్ సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version