NTV Telugu Site icon

K.Chandrashekar Rao : వరంగల్‌లో రెండో రోజు సీఎం కేసీఆర్ బస

Cm Kcr Warangal

Cm Kcr Warangal

Telangana Chief Minister K.Chandrashekar Rao Warangal Tour Updates.

ఏడాదిలోగా గోదావరి వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది గోదావరి తీరంలో వరద ముంపు సమస్య ఉండదని హామి ఇచ్చారు.‌ వర్షంలో ములుగు జిల్లాలో పర్యటించిన సీఎం కేసిఆర్, రెండో రోజు హన్మకొండలో బస చేస్తున్నారు. అటవీశాఖ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన సీఎం, ములుగు డిఎఫ్వో ను తీవ్రంగా మందలించారు. వెరీ సారీ అంటూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో దొంగలు తయ్యారయ్యారని, అన్ని అమ్ముకదొబ్బుతున్నారని సీరియస్ గా ఫైర్ అయ్యారు. వర్షం వరదలు సృష్టించిన బీభత్సాన్ని పరిశీలించేందుకు సీఎం కేసిఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.‌ నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి వరంగల్ కు చేరుకున్న సీఎం ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.‌

హన్మకొండ నుంచి రోడ్డు మార్గాన ములుగు మీదుగా ఏటూరు నాగారం చేరుకున్న సీఎం, ఏటూరునాగారం లో ఆగకుండా నేరుగా భద్రాచలం వెళ్ళి తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్ ద్వారా ఏటూరు నాగారం చేరుకున్నారు. భద్రాచలం నుంచి తుపాకుల గూడెం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ప్రభావాన్ని ఏరియల్ సర్వే ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డితో కలిసి సీఎం పరిశీలించారు. మరో హెలికాప్టర్ లో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఏటూరునాగారం ఐటిడిఏ గెస్ట్ హౌస్ లో లంచ్ చేసిన అనంతరం సీఏం రామన్నగూడెం పుష్కరఘాట్ కు చేరుకుని గోదావరి కి శాంతిపూజలు చేసి గంగమ్మతల్లికి సారే చీర సమర్పించారు. వరద ముంపునకు గురైన ఎస్సీ, ఎస్టీ కాలనీలో పర్యటించి పరిశీంచారు.‌ వరద బాధితుల పరామర్శించి వరద సమస్యను స్వయంగా పరిశీలించానని తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి వరద ముంపు సమస్యే ఉండదని స్పష్టం చేశారు.

వర్షం వరదల నష్టాన్ని పరిశీలించిన అనంతరం ఏటూరునాగారం ఐటిడిఏ కార్యాలయానికి చేరుకుని ఉమ్మడి జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. వర్షం వరదలతో తెగిన చెరువులు, దెబ్బతిన్న రోడ్లను, మిషన్ భగీరథ పైప్ లైన్ లను వెంటనే రిపేర్ చేయాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతవాసులను వారిగా ఎంతైనా ప్రాంతాలకు తరలించి శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అటవీ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపడితే అభ్యంతరం ఏంటని అటవీశాఖ అధికారులను ప్రశ్నించారు.‌ ములుగు జిల్లా డిఎఫ్వో ప్రదీప్ కుమార్ శెట్టిని నిలబెట్టి మందలించారు.

గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసిఆర్ కటాక్షపూర్ వద్ద రోడ్డుపై నుంచి చెరువు అలుగుపారడం చూసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉదయం సాయంత్రం అదే రూట్ లో బస్సులో వెళ్ళిన కేసిఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ రూట్ లో వెళ్ళినప్పుడు చేపలు పెట్టేవాళ్ళు జై తెలంగాణ అని నినదించేవారని సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర నేతలకు సీఎం వివరించారు. రాత్రి హన్మకొండ కు చేరుకున్న సీఎం, కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో బస చేసి రేపు ఉదయం కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీ వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసి మధ్యాహ్నం వరకు హైదరాబాద్ కు చేరుకునే అవకాశం .