NTV Telugu Site icon

తెలంగాణ కరోనా అప్డేట్‌.. ఇవాళ ఎన్నంటే ?

తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 729 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కగా.. మరో 5 మంది కరోనా బాధితులు మృతి చెందారు.. ఇక, ఇదే సమయంలో 772 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్‌..

read also : సినిమా థియేటర్ల సమస్యలు పరిష్కరిస్తా- తలసాని

దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,36,049 కు చేరగా… రికవరీ కేసులు 6,22,313 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 3756 కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9,980 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఒకే రోజు 1,15,515 శాంపిల్స్ పరీక్షించినట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు.