Site icon NTV Telugu

ఇవాళ మరోసారి భేటీ కానున్న తెలంగాణ కేబినెట్

తెలంగాణ కేబినెట్ ఇవాళ మళ్లీ భేటీకానుంది. నిన్న జరిగిన భేటీలో కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా, జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఉద్యోగ ఖాళీల గుర్తింపుపై ఇవాళ చర్చించనుంది కేబినెట్. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సత్వరమే జరగాలని అధికారులను ఆదేశించిన కేబినెట్.. ఖాళీల భర్తీకి వార్షిక క్యాలెండర్ తయారు చేయాలని నిర్ణయించింది. గురుకులాల్లో స్థానిక నియోజకవర్గ విద్యార్థులకే 50శాతం సీట్లు కేటాయించ నున్నారు.

read also : ఇవాళ అమిత్‌షాతో బండి సంజయ్, ఈటల భేటీ !

మరోవైపు పల్లెప్రగతిపై కేబినెట్‌ చర్చించింది. మున్సిపాలిటిల అభివృద్ధి కోసం ల్యాండ్ పూలింగ్ వ్యవస్థ ద్వారా ప్రత్యేక లేఅవుట్లు అభివృధ్ధి చేయాలని.. దానికి సంబంధించిన విధి విధానాలను అన్వేషించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ శివారులోని మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్యపై చర్చంచిన సీఎం.. అదనంగా 1200 కోట్లను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

Exit mobile version