Site icon NTV Telugu

Telangana Budget: ముగిసిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ కేబినెట్‌ సమావేశమైంది. ఈ సమావేశంలో రేపు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైన కేబినెట్ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది. శాస‌న‌సభ సమా‌వే‌శాల నిర్వహణ, వివిధ రంగాల్లో సర్కార్‌ సాధించిన ప్రగతి, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమా‌ధా‌నాలు, ప్రభుత్వ ప్రాధా‌న్యాలు, ప్రజల అవ‌స‌రాలు తది‌తర అంశా‌లపై మంత్రి‌వర్గ సమా‌వే‌శంలో చ‌ర్చించారు.

అనంతరం మంత్రిమండలి భేటీ ముగిసింది. అయితే రేపే సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 1,200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Exit mobile version