Telangana Budget 2024: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ సమాజం మార్పు కోరుకుందని అన్నారు. అందరి కోసం మనందరం అనే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామన్నారు. సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరడం ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించుకున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలన్నారు. మాది ప్రజల ప్రభుత్వం..తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చామన్నారు.
Read also: Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. Live & Update
రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ.. విధివిధానాలు ఖరారు చేయబోతున్నాం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అనంతరం రూ.2,75,891 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.29,669 కోట్లు.కాంగ్రెస్ ఆరు హామీల అమలుకు రూ. 53,196 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారమే ఈ కేటాయింపు జరిగిందని చెబుతున్నారు. హామీలకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతోందని, ఇది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులను కేటాయిస్తామని విక్రమార్క తెలిపారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను చదువుతున్నారు.
Read also: Mithun Chakraborty: గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి!
బడ్జెట్ హైలెట్స్..
* 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891 కోట్ల రూపాయాలు..
* ఆరు గ్యారెంటీల కోసం రూ.53,196 కోట్లు అంచనా..
* పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు,
* ఐటీ శాఖకు రూ.774 కోట్లు.
* పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు,
* పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు..
* మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు,
* వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు,
* ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250 కోట్లు,
* ఎస్సీ సంక్షేమం రూ. 21,874 కోట్లు,
* ఎస్టీ సంక్షేమం రూ.13,013,
* మైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు.
* బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు.
* బీసీ సంక్షేమం రూ8 వేల కోట్లు, విద్యా రంగానికి రూ.21,389 కోట్లు.
* తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు.
* యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు,
* వైద్య రంగానికి రూ.11,500 కోట్లు,
* విద్యుత్ – గృహ జ్యోతికి రూ.2,418కోట్లు.
* విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు..
* గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు.
* నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు
* విద్యారంగానికి రూ, 21, 389 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. కాగా.. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ కొనసాగిస్తామని, విధివిధానాలు ఖరారు చేయబోతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Mithun Chakraborty: గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి!
