Telangana Budget 2022-23: రాష్ట్ర బడ్జెట్‌ హైలైట్స్..

2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టింది టీఆర్ఎస్‌ ప్రభుత్వం… రూ. 2,56,958.51 కోట్లతో బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు.. రెవెన్యూ వ్యయం రూ. 1.89 ల‌క్షల కోట్లుగా ఉండగా.. క్యాపిట‌ల్ వ్యయం రూ. 29,728 కోట్లుగా ఉంది.. ఇక, 2022-23 ఏడాది బడ్జెట్‌ మొత్తం ఎంత? రాబలి ఎలా ఉంది? కేటాయింపులు ఎలా ఉన్నాయి? ఏ రంగారికి ఎంత కేటాయించారు.. లాంటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • రాష్ట్ర బ‌డ్జెట్ రూ. 2.56 ల‌క్షల కోట్లు
  • రెవెన్యూ వ్యయం రూ. 1.89 ల‌క్షల కోట్లు
  • క్యాపిట‌ల్ వ్యయం రూ. 29,728 కోట్లు
  • పన్నుల ద్వారా ఆదాయం రూ. 1,08,212 కోట్లు
  • కేంద్ర ప‌న్నుల్లో వాటా రూ. 18,394 కోట్లు
  • ప‌న్నేత‌ర ఆదాయం రూ. 25,421 కోట్లు
  • గ్రాంట్లు రూ. 41,001 కోట్లు
  • రుణాలు రూ. 53,970 కోట్లు
  • అమ్మకం ప‌న్ను అంచ‌నా రూ. 33 వేల కోట్లు
  • ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ. 17,500 కోట్లు
  • స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ల ద్వారా రూ. 15,600 కోట్లు
  • ఆర్టీసీ బ‌లోపేతానికి రూ. 1500 కోట్లు కేటాయింపు
  • పోలీసుశాఖ‌కు రూ. 9,315 కోట్లు కేటాయింపు
  • కాళేశ్వరం స‌ర్క్యూట్‌లో టూరిజం అభివృద్ధి కోసం రూ. 1500 కోట్లు కేటాయింపు
  • రోడ్ల నిర్మాణం, మ‌ర‌మ్మతులు, నిర్వహ‌ణకు రూ. 1542 కోట్లు కేటాయింపు
  • ప‌రిశ్రమ‌ల‌కు ప్రోత్సాహ‌కాలుగా రూ. 2,142 కోట్లు కేటాయింపు
  • ప‌రిశ్రమ‌ల‌కు విద్యుత్ రాయితీల కింద రూ. 190 కోట్లు కేటాయింపు
  • పావ‌లా వ‌డ్డీ ప‌థ‌కానికి రూ. 187 కోట్లు కేటాయింపు.
  • మ‌హిళా విశ్వవిద్యాల‌యానికి రూ. 100 కోట్లు కేటాయింపు
  • కొత్త వైద్య కాలేజీల‌కు రూ. 1000 కోట్లు కేటాయింపు
  • అట‌వీ విశ్వవిద్యాల‌యాల‌కు రూ. 100 కోట్లు కేటాయింపు
  • మ‌న ఊరు – మ‌న బ‌డి ప‌థ‌కానికి రూ. 3,497 కోట్లు కేటాయింపు
  • వ్యవ‌సాయ రంగానికి రూ. 24,254 కోట్లు కేటాయింపు
  • పామాయిల్ సాగుకు రూ. 1000 కోట్లు కేటాయింపు
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీ
  • రూ. 50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీకి నిర్ణయం
  • పంట రుణాలు మొత్తం రూ. 16,144 కోట్లు మాఫీ, ఈ ద‌ఫాలో 5.12 ల‌క్షల మంది రైతుల‌కు రుణ మాఫీ
  • ఆస‌రా పెన్షన్ల‌కు రూ. 11,728 కోట్లు కేటాయింపు
  • ద‌ళిత‌ బంధుకు రూ. 17,700 కోట్లు కేటాయింపు
  • ఎస్టీల సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు కేటాయింపు
  • బీసీల సంక్షేమం కోసం రూ. 5,698 కోట్లు కేటాయింపు
  • క‌ల్యాణ‌లక్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ. 2,750 కోట్లు కేటాయింపు
  • బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. 177 కోట్లు కేటాయింపు
  • దూప దీప నైవేద్య ప‌థ‌కానికి రూ. 12.50 కోట్లు కేటాయింపు
  • సొంత స్థలంలో డ‌బుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం
  • సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ. 3 ల‌క్షల ఆర్థిక సాయం
  • నియోజ‌క‌వ‌ర్గానికి 3 వేల ఇళ్లు కేటాయింపు, ఎమ్మెల్యేల ప‌రిధిలో 3.57 ల‌క్షల ఇళ్లు కేటాయింపు
  • డ‌బుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ. 12 వేల కోట్లు కేటాయింపు
  • ప‌ల్లె ప్రగ‌తికి రూ. 3330 కోట్లు కేటాయింపు
  • ప‌ట్టణ ప్రగ‌తికి రూ. 1394 కోట్లు కేటాయింపు
  • హ‌రిత‌హారానికి రూ. 932 కోట్లు కేటాయింపు
  • హైద‌రాబాద్ మెట్రో సిటీ ప‌రిధిలో రోజుకు 20 లీట‌ర్ల ఉచిత నీటి ప‌థ‌కానికి రూ. 300 కోట్లు
  • పాత‌బ‌స్తీలో మెట్రో రైలు కోసం రూ. 500 కోట్లు కేటాయింపు
  • అర్బన్ మిషన్ భగీరథకు రూ. 800 కోట్లు కేటాయింపు
  • ఎయిర్‌పోర్టు మెట్రో అనుసంధానానికి రూ. 500 కోట్లు కేటాయింపు
  • హైద‌రాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌కు రూ. 1500 కోట్లు కేటాయింపు
  • వోఆర్ఆర్ చుట్టు ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి సరఫరాకు రూ. 1200 కోట్లు కేటాయింపు.