మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘గత రెండు రోజులుగా నీరసంగా ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. చాలా స్వల్ప లక్షణాలతో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
కాగా, నల్లగొండ ఎన్‌జీ కాలేజీ మైదానంలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆదివారం భారీ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సభకు భారీ ఎత్తున జనాలు తరలివచ్చారు. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రామ్‌జీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు.
ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌కు కరోనా పాజిటివ్
