BJP Leaders to Delhi: తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు అందింది. ఈ మేరకు బీజేపీ నేతలకు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. వీరు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ సాతో భేటీ కానున్నారు. హైకమాండ్ పిలుపుతో నిన్ననే ఢిల్లీకి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చేరుకున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను నేతలు అమిత్‌షాకు వివరించనున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు.. మోడీ టూర్ విజయవంతం.. ఇక వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలపై అమిత్ షాతో నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Read also: Shraddha Case: కేసులో షాకింగ్ ట్విస్టులు.. ఫ్రిజ్‌లో శవం పెట్టి, మరో యువతితో రొమాన్స్
ఇక మునుగోడు ఉపఎన్నికల్లో ఓటమి పాలైన గట్టి పోటీ ఇచ్చామని.. నైతిక విజయం తమదేనని బీజేపీ చెబుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు రాష్ట్ర యంత్రాంగం అంతా కదలివచ్చిందని బీజేపీ అంటున్నారు. అయితే.. సాంకేతికంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా.. నైతికంగా మాత్రం తామే గెలిచామని చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోందని మునుగోడులో 6 శాతం ఓట్ల నుంచి తమ బలం 40 శాతానికి పెరిగిందని అంటున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ టూర్‌కు వచ్చిన మోడీకి వివరించామని రాజగోపాల్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఇక పీఎం మోడీ కూడా బీజేపీ కార్యకర్తల పోరాటాన్ని మెుచ్చుకున్నారు. రాష్ట్ర సర్కారుపై పరోక్షంగా నిప్పులు చెరిగిన మోడీ, ఉపఎన్నిక ఫలితాన్ని చూస్తుంటే తెలంగాణలో కమలం వికసించే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోందన్నారు. మునుగోడు ఉపఎన్నిక కోసం ప్రభుత్వం అంతా దిగొచ్చిందని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ మునుగోడు ఉపఎన్నిక కోసం తరలివచ్చారని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయికి వెళ్లాలని ప్రధాని మోడీ సూచించారు. అయితే.. మునుగోడు ఉపఎన్నిక, ప్రధాని టూర్ తర్వాత నేతలను హైకమాండ్ ఢిల్లీకి ఆహ్వానిచటంపై సర్వత్రా ఉత్కంఠంగా మారింది.
Elephant in Well: బావిలో పడ్డ ఏనుగు..ఎలా బయటకు తీశారంటే..?