NTV Telugu Site icon

Boora Narsaiah Goud: హత్యల్లో తెలంగాణ బీహార్‌ను మించిపోయింది

Boora Narsaiah Goud

Boora Narsaiah Goud

Telangana Beats Bihar In Crimes Says Boora Narsaiah Goud: హత్యల్లో బీహార్‌ను తెలంగాణ రాష్ట్రం మించిపోయిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. రాజకీయాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం మెడికో ప్రీతిని నిమ్స్‌కు తరలించిందని పేర్కొన్నారు. ఆమె నిమ్స్‌లో పొలిటికల్ వెంటిలేటర్ మీద ఉందన్నారు. అపోలోకు షిఫ్ట్ చేయాలని ఆదేశాలు వచ్చినప్పుడు.. అసలు విషయం బయటకు వస్తుందన్న భయంతో ప్రీతి చనిపోయిందని ప్రకటించారని చెప్పారు. మద్యం, డ్రగ్స్, మతం కారణంగా.. చాలా సంఘటనలు, నేరాలు ఘోరాలు రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో రోడ్ల మీద నరుక్కోవడం ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కానిస్టేబుల్‌కు ఉన్న విలువ కూడా హోమ్ మంత్రికి లేదన్నారు. ప్రీతి ఎపిసోడ్‌పై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు రాత్రిపూట ఒంటరిగా వీధుల్లో తిరిగి.. కుక్కల గురించి తెలుస్తుందని, అవి పిక్కలు పీక్కు తింటాయని అన్నారు.

Bandi Sanjay: బీజేపీ భిక్ష వల్లే కేసీఆర్ సీఎం అయ్యాడు.. బండి సంజయ్ ధ్వజం

మరోవైపు.. శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటన గురించి తెలిసి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాలేజీ వద్దకు వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు దరిద్రం పట్టిందని విరుచుకుపడ్డారు. తెలంగాణ వచ్చాక శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు ఉండవని కేసీఆర్ అన్నారని.. ఇప్పుడు గల్లీకి మూడు కాలేజీలు అవే ఉంటున్నాయని మండిపడ్డారు. ప్రైవేటు విద్యాసంస్థల తీరు, ఫీజు స్ట్రక్చర్ మారాలని సూచించారు. ర్యాంకుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తేవడం సరైనది కాదని హితవు పలికారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని కేసీఆర్ హామీ ఇచ్చారని.. అది ఎక్కడ అమలు అవుతోందని విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

Kidney For Sale: భరణం కోసం భార్య వేధింపులు.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త