తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టి సభలో BRS ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర సర్కార్ స్కీమ్ లను కేంద్రం కాపీ కొడుతుందని సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఏపీలో కేవలం రేషన్ కోసం అవసరమైన ధాన్యంను మాత్రమే అక్కడి ప్రభుత్వం సేకరిస్తుందని తెలిపారు. తెలంగాణలో మాత్రం కేసీఅర్ సర్కార్ రైతుల నుంచి మొత్తం ధాన్యం సేకరిస్తుందని అన్నారు. దళిత బంధు పథకం ను విపక్షాలు అర్థం చేసుకోవాలి… ఆ పథకంను రాజకీయ సుడిగుండంలోకి తీసుకుపోవద్దంటూ సూచించారు. పార్లమెంట్ కు కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెట్టాలని అన్నారు.
Telangana Assembly Session Live: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు లైవ్
Show comments