Site icon NTV Telugu

Duddilla Sridhar Babu : రాష్ట్ర ఏరోస్పేస్ ఎగుమతుల్లో రికార్డు స్థాయి వృద్ధి

Sridhar Babu

Sridhar Babu

Duddilla Sridhar Babu : గచ్చిబౌలి ఐఎస్బీలో నిర్వహించిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్, ఐఎస్‌బీ, ముంజాల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు, ఏరోస్పేస్–డిఫెన్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వేగవంతమైన మార్పులను తెలంగాణ తన అవకాశాలుగా మలచుకునే దిశగా కృషి చేస్తోందని చెప్పారు.

Delhi Police Heroes: శభాష్ పోలీస్.. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను రక్షించారు

గ్లోబల్ సప్లై చెయిన్ ఒత్తిడితో ప్రపంచ దేశాలు నమ్మకమైన తయారీ కేంద్రాల కోసం భారత్‌ను ఆశ్రయిస్తున్నాయని, ఈ మార్పులు తెలంగాణకు పెద్ద అవకాశమని పేర్కొన్నారు. దేశ రక్షణ ఉత్పత్తుల విలువ గతేడాది రూ.1.5 లక్షల కోట్లను దాటడం, రక్షణ ఎగుమతులు 12% పెరగడం భారత్ శక్తిని ప్రతిబింబిస్తోందని వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని, అందులో ఏరోస్పేస్–డిఫెన్స్ రంగం కీలక భాగమని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 25 కి పైగా అంతర్జాతీయ, జాతీయ స్థాయి ఏరోస్పేస్–డిఫెన్స్ కంపెనీలు, 1,500 కి పైగా ఎంఎస్ఎంఈలు తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచం ముందుకు తీసుకెళ్తున్నాయని తెలిపారు.

రాష్ట్ర ఏరోస్పేస్ ఎగుమతులు 2023–24లో రూ.15,900 కోట్లుగా ఉండగా, 2024–25 తొలి తొమ్మిది నెలల్లోనే రూ.30,742 కోట్లకు పెరగడం ప్రభుత్వ విధానాల విజయాన్ని స్పష్టంగా చూపిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆదిభట్లలో టాటా–సాఫ్రాన్ రూ.425 కోట్ల యంత్రాంగాన్ని ఇటీవల ప్రారంభించగా, త్వరలోనే జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్ రూ.800 కోట్లతో యూఏవీ తయారీ కేంద్రం, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ రూ.500 కోట్లతో డిఫెన్స్ ఫెసిలిటీ ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. అలాగే, మరికొన్ని ప్రపంచ దిగ్గజ సంస్థలు కూడా తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి అన్నారు.

Chennai Super Kings: సీఎస్కేను వీడిన జడ్డూ భాయ్.. చెన్నై ఫ్రాంచైజీ సీఈవో కీలక వ్యాఖ్యలు..

Exit mobile version