NTV Telugu Site icon

Fake Doctor in Warangal: 43 వేల మందికి వైద్యం.. నకిలీ డాక్టర్‌ అరెస్ట్‌

Fake Doctor In Warangal

Fake Doctor In Warangal

సమాజంలో ఎక్కడ చూసిన దొంగ బాబాలు, నకిలీ డాక్టర్​ల సంఖ్య పెరుగుతోంది. నమ్మకంతో వారివద్దకు వెళ్లే ప్రజలే టార్గెట్ మలుచుకుంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ఈ నకిలీలు. సామాన్య ప్రజల నుంచి దోచుకునేందుకు ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నారు. ప్రాణాలపై ఆశతో వారి వద్దకు వెళ్తే.. జీవితంపై ఆశలు వదులుకునేలా చేస్తున్నారు. ఫేక్ సర్టిపికేట్ తో వైద్యుడుగా చలామని అవుతూ.. తెలిసీ తెలియని వైద్యంతో దండిగా దండుకుని, సామాన్యులకు జేబులు గుళ్ల చేస్తున్నారు. ఇలాంటి ఇలాంటి ఓ నకిలీ వైద్యుడిని, అతడి సహాయకుడిని వరంగల్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

read also: Intelligence Bureau: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఉగ్ర ముప్పు..! ఐబీ హెచ్చరికలు

వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ నగరానికి చెందిన ముజతాబా అహ్మద్‌ బీఫార్మసీ విద్యాభ్యాసాన్ని మధ్యలో ఆపేసాడు. వరంగల్ లోని ఓ స్థానిక వైద్యుడి వద్ద సహాయకుడిగా పని చేస్తుండేవాడు. అతని అవసరాలకు డబ్బులు సరిపోలేదు. దీంతో నకిలీ వైద్యుడి అవతారమెత్తాడు. ఎయిమ్స్‌ నుంచి ఎంబీబీఎస్‌ చేసినట్లు నకిలీ ధ్రువపత్రం సొంతంగా సృష్టించుకోవడమే కాకుండా.. నగరంలోని చింతల్‌ ప్రాంతంలో 2018లో హెల్త్‌కేర్‌ ఫార్మసీ పేరిట ఆసుపత్రి ప్రారంభించాడు. ముజతాబాకు సహాయకుడిగా దామెరకొండ సంతోశ్​ పెట్టుకున్నాడు. నిజమైన వైద్యుడినేనని ప్రజలను ముజతాబా నమ్మించాడు. వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసేవాడు.

ఈనేపథ్యంలో.. నాలుగేళ్ల కాలంలో రోజుకు 30,40 మంది చొప్పున సుమారు 43 వేల మందికి నకిలీ వైద్యుడు వైద్యం అందించాడని దర్యాప్తులో వెల్లడైందని దీంతో పోలీసులు షాక్ తిన్నారు. అవసరం లేకున్నా రోగనిర్ధారణ పరీక్షలు రాసి, మందులు ఇచ్చేవాడని, వ్యాధి చిన్నదైనా భయపెట్టి పెద్ద ఆసుపత్రులకు పంపించి కమీషన్లు దండుకునేవాడ పోలీసులు పేర్కొన్నారు. ఓ బాధితుడు నకిలీ వైద్యుడిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు. ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించగా.. నకిలీ వైద్య ధ్రువపత్రాలు బయట పడ్డాయి. దాంతో పాటు రూ.1.90 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌, మూడు సెల్‌ఫోన్లు, ల్యాబ్‌ పరికరాలను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్టు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
MAA: ‘మా’ వాళ్ళకే అవకాశం ఇవ్వమంటున్న మంచు విష్ణు!