తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించాం. ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. డయాలసిస్, 24గంటలు ఫార్మా యూనిట్ ఐసీయూ ఏర్పాటుచేస్తాం అన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. అందుకోసం ప్రణాళికలు రూపొందించామని, డయాలసిస్, 24గంటలు ఫార్మా యూనిట్ ఐసీయూ ఏర్పాటు చేశామన్నారు. మార్చి లోపు కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిద్దుతాం.
లేగాటో, డిబీఎస్ నుంచి దాతలు కూడా ముందుకువచ్చారు. రికార్డ్ స్థాయికి ఆర్టీసీ ఆదాయం పెరిగింది. ఉద్యోగుల సంక్షేమం కోసం యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుంది. ఉద్యోగులంతా సమిష్టిగా కృషి చేసి..ఆదాయాన్ని పెంచడంలో పాలుపంచుకోవాలన్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఆర్టీసీలో నవ శఖం మొదలైందన్నారు. గతంలో ఈ సంస్థను ఎక్కడ అమ్మేస్తారో…ప్రైవేట్ అవుతుందో అనుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ సంస్థను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.
సీఎం కేసీఆర్ సంస్థపై నమ్మకం కలిగించాలన్నారు. ప్రతి ఏడాది 40కోట్లు ఖర్చు అవుతుంది. మెడికోవర్ మంచి సంస్థ. ఆ సంస్థ సహకారం చాలా ముఖ్యమైనది. మన ఆసుపత్రికి వచ్చిన వారు ఏ ఆసుపత్రికి రిఫర్ చేయవద్దన్నారు. ప్రభుత్వ ఆర్థిక సహకారమే కాదు మనం కూడా స్వతహాగా కష్టపడి సంస్థలో లాభాలు తెచ్చుకోవాలన్నారు. సంస్థను బాగు చేయాలనుకునే వ్యక్తులున్నారు. కాబట్టే సాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారన్నారు గోవర్థన్.
థర్డ్, ఫోర్త్ వేవ్ కొన్ని దేశాల్లో వ్యాపిస్తుందని, మన రాష్ట్రంలో అదుపులో పెట్టగలిగామన్నారు డీఎంవో శ్రీనివాసరావు. సీఎం కేసీఆర్ సహకారం వల్లే అది సాధ్యమైందన్నారు. ఆర్టీసీ బస్సులు పేద ప్రజల ఆడి, బిఎమ్.డబ్ల్యులు. అన్ని రంగాలు కోవిడ్ పై కలిసికట్టుగా పనిచేశాయి. దాదాపు విజయం సాధించబోతున్నాం.ఆర్టీసీలో అనేక మార్పులు వస్తున్నాయి. తార్నాక ఆసుపత్రి రాబోయే రోజుల్లో అధునాతన ఆస్పత్రిగా మారబోతుందన్నారు.
