సినీ పరిశ్రమకు చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ మంత్రి తలసానికి వినతిపత్రం సమర్పించామని సినీ నిర్మాత తమ్మారెడ్డ భరద్వాజ అన్నారు. ఇప్పటికే చిరంజీవి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి సమస్యల గురించి చర్చించారని ఆయన అన్నారు. ఆన్లైన్ బుకింగ్ తెస్తామని రెండు ప్రభుత్వాలు చెప్పాయని, బుక్ మై షో వాళ్ళు టికెట్‌పై 15 నుంచి 25 రూపాయల వరకు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని అన్నారు. ఆన్లైన్ వస్తే దోపిడీ పోతుంది. ప్రొడ్యూసర్ కు డబ్బులు కూడా వస్తాయని, ఆన్లైన్ బుకింగ్ ఛాంబర్ తో కలిసి ఉండాలి. ప్రభుత్వం తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటే కుదరదని ఆయన అన్నారు.
ఇంగ్లీషు, హిందీ సినిమాలకు క్యూబ్ వంటి సంస్థలు ఛార్జ్ చేయరు. తెలుగు, చిన్న సినిమాల వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటారు. దాంతో నష్టం వస్తుందని ఆయన వెల్లడించారు. ట్రాన్స్ ఫర్ ఛార్జీ కూడా తీసుకుంటున్నారని, టిక్కెట్ రేట్లు అనేది చాలా చిన్న ఇష్యూ అని ఆయన అన్నారు. తెలంగాణలో టిక్కెట్ రేట్లు పెంచారు. కానీ తగ్గించక పోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, రేట్లు పెంచితే డబ్బులు వస్తాయనేది భ్రమ అని ఆయన తెలిపారు. ఆంధ్రలో పుష్పా సినిమా ఎక్కువ డబ్బులు రాబట్టిందని, అఖండా కంటే పుష్పా ఎక్కువ పోయిందని ఆయన పేర్కొన్నారు. ఎక్కువ స్క్రీన్ లలో సినిమా వేస్తే డబ్బులు వస్తాయని, 200 కోట్లు సినిమా ఉంటే 80 కోట్లు ట్యాక్స్ కట్టాలని, వెయ్యి కోట్లకు 20 కోట్లు ట్యాక్స్ కట్టాలని ఆయన అన్నారు.
ప్రభుత్వంతో అన్ని సరి చేసుకోవాలి. ఐదు షోలు కొన్నింటికి పెట్టుకోవాలని, 2013 నుంచి అవార్డులు ఇవ్వడం లేదన్నారు. చిన్న సినిమాలకు ఏపీలో సబ్సిడీలు ఇవ్వాలని, తెలంగాణలో సింహా అవార్డులు ఇస్తామన్నారు. ఇవ్వడం లేదని ఆయన వెల్లడించారు. తెలంగాణలో లొకేషన్ ఛార్జీలు తీసేయాలని, మినీ థియేటర్లు ఎక్కువగా రావాల్సి ఉంది. వాటి వల్ల రెవెన్యూ బాగా వస్తుంది. థియేటర్లకు ఇండస్ట్రీయల్ పవర్ టారిఫ్ తీసుకోవాలని, కరోనా సమయంలో థియేటర్లకు కరెంటు బిల్లు రెండు రాష్ట్రాలు మినహాయింపు ఇవ్వలేదని, ఇండస్ట్రీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు. సినీ పరిశ్రమ కూడా తప్పులు చేసిందని ఆయన అన్నారు.
