Site icon NTV Telugu

Illegal Affair In Warangal: మరో మహిళతో అడ్డంగా దొరికిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Warangal Officers Illegal A

Warangal Officers Illegal A

Suspended Superintendent Illegal Affair With Revenue Inspector In Warangal: మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కామ కోరికలు తీర్చుకోవడం కోసం, తమ పచ్చని కాపురాల్ని తామే కూల్చేసుకుంటున్నారు. తాము చేస్తోంది తప్పని తెలిసినా, ఆ అక్రమ దారిలోనే వెళ్తున్నారు. దీంతో.. సాఫీగా సాగాల్సిన సంసారాలు భగ్గుమంటున్నాయి. కుటుంబ పరవులు రోడ్డున పడుతున్నాయి. తాజాగా వరంగల్ నగరంలో అలాంటి వ్యవహారమే ఒకటి వెలుగులోకి వచ్చింది. తనకు భార్య ఉన్నప్పటికీ, అతడు మరో మహిళపై మోజు పెంచుకున్నాడు. తన అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భార్యని వేధించాడు. చివరికి అడ్డంగా బుక్కై, కటకటాలపాలయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

వరంగల్ నగరంలోని పైడిపల్లి ఆర్టీసీ కాలనీలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించిన జీవన్ కుమార్ అనే వ్యక్తి, కొంతకాలం క్రితం సస్పెండ్ అయ్యాడు. ఇతనికి నాలుగేళ్ల క్రితమే కుమార్ పల్లికి చెందిన చందనతో వివాహం అయ్యింది. అయితే.. పెళ్లికి ముందే ఇతనికి తాను పని చేసిన కార్పొరేషన్‌లోనే రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తున్న ప్రతిభ అనే మహిళతో అక్రమ సంబంధం ఉంది. అందుకే.. పెళ్లైన మొదట్నుంచే అతడు తన భార్యన వేధిస్తూ వచ్చాడు. ఏనాడూ ఆమె పట్ల సరిగ్గా ప్రవర్తించింది లేదు. ఎంతైనా కట్టుకున్న భర్తే కదా.. ఏదో ఒక రోజు మార్పు వస్తుందిలే అనుకొని, చందన అతని చిత్రహింసల్ని భరిస్తూ వచ్చింది. అయితే.. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా జీవన్ కుమార్‌లో మార్పు రాలేదు.

తన భార్య చందనని జీవన్ మరింత వేధించసాగాడు. అంతేకాదు.. ఇంటికి సరిగ్గా వచ్చేవాడు కాదు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. అతని ప్రవర్తనలో కూడా చాలా మార్పులు వచ్చేశాయి. దీంతో.. భర్తపై చందనకు అనుమానం వచ్చింది. కచ్ఛితంగా తన మరొకరితో అక్రమ సంబంధం ఉందని అనుమానించింది. ఆ అనుమానం నిజం అయ్యింది. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌తో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని తేలింది. దీంతో తన భర్తకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. తన బంధువుల్ని పిలిపించి.. ప్రతిభతో జీవన్ కుమార్ ఉన్న సమయంలో అడ్డంగా పట్టుకొని, బంధువుల చేత దేహశుద్ది చేయించింది. అనంతరం ఆ ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Exit mobile version