దళిత బంధు పథకంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధు ఎంతో గొప్ప పథకమని కితాబిచ్చారు. ఈ పథకాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు. పథకం అమలుతో దళితుల జీవితాలు పూర్తిగా మారిపోతాయనడంలో ఎలాంటి సందేహంలేదని పేర్కొన్నారు. దళిత బంధు అమలులో సీఎం కేసీఆర్ నిర్ణయాలకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
Read: పుష్ప : “దాక్కో దాక్కో మేక” సాంగ్ వచ్చేసింది !
హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. దళిత బంధు విషయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్ని పార్టీలకు హితవుపలికారు.దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి రాజకీయాలకు అతీతంగా మద్దతు పలకాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఈ పథకాన్ని పారదర్శకంగా అమలుచేస్తూ.. ప్రతి దళిత కుటుంబానికి న్యాయంజరిగేలా చూడాలని కోరారు.
