Site icon NTV Telugu

Supreme Court : దేశంలోని బార్ కౌన్సిల్ ల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Supreme Court

Supreme Court

దేశంలోని బార్ కౌన్సిల్ ల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 31 నాటికి ఎన్నికలు జరగని బార్ కౌన్సిల్ ల ఎన్నికలు పూర్తి చేయాలని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటూ, పలు రాష్ట్రాల బార్ కౌన్సిల్ ఎన్నికలు రెండేళ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్నాయి. దాంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రూల్ 32 పై సుప్రీంకోర్టును తమిళనాడు బార్ కౌన్సిల్ మెంబర్ వర్ధన్ ఆశ్రయించారు.

2923 లో వర్ధన్ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా మార్చ్ 31 నాటికి ఎన్నికలు నిర్వహిస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రాల బార్ కౌన్సిల్ లు వాదనలు వినిపించాయి. తెలంగాణ బార్ కౌన్సిల్ నుంచి వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, బార్ కౌన్సిల్ మెంబర్ జావేద్ లు హాజరయ్యారు. వాస్తవానికి రూల్ 32 నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా పలు రాష్ట్రాల్లో బార్ కౌన్సిల్ ఎన్నికలు ఆగిపోయాయి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి బార్ కౌన్సిల్ లకు ఎన్నికలు జరుగుతాయి. కానీ రూల్ 32 తీసుకువచ్చాక ఐదేళ్లకు పూర్తి కావాల్సిన బార్ కౌన్సిల్ టర్మ్ ను ఇప్పటికే మొదట 18 నెలలు, ఆ తర్వాత ఆరు నెలల పాటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పొడిగించింది.

ఇంతకీ రూల్ 32 ఏంటి ?

నకిలీ న్యాయవాదులను గుర్తించి, వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని 2015లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్ నెంబర్ 32ను తీసుకువచ్చింది. రూల్ నెంబర్ 32 ప్రకారం ఆయా రాష్ట్రాల బార్ కౌన్సిల్ పరిధిలో ఉన్న కోర్టుల్లో నకిలీ అడ్వకేట్లను గుర్తించడం, ప్రాక్టీస్ చేయని అడ్వకేట్లను గుర్తించి తమ కౌన్సిల్ జాబితా నుంచి తొలగించాలి.

అయితే న్యాయవాదుల వెరిఫికేషన్ ప్రక్రియకు సమయం పడుతుంది కావున అందుకోసం అప్పటికే ఉన్నటువంటి బార్ కౌన్సిల్ ల పదవీ కాలాన్ని 18 నెలలపాటు పొడిగించింది. ఆ తరువాత మరో ఆరు నెలలపాటు పొడిగించాల్సి వచ్చింది. అయితే రూల్ నెంబర్ 32 పేరుతో బార్ కౌన్సిల్ ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని తమిళనాడు బార్ కౌన్సిల్ మెంబర్ వర్ధన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Exit mobile version