NTV Telugu Site icon

Illness for Students: అస్వస్థతకు గురైన విద్యార్థులు.. 40 మందికి వాంతులు, విరోచనాలు..

Kondapour Sri Chaitanya Clllege

Kondapour Sri Chaitanya Clllege

Illness for Students: ఓ ప్రవేట్‌ కాలేజీ ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కొండాపూర్‌ లో చోటుచేసుకుంది. శ్రీ చైతన్య కాలేజ్ వాల్మీకి బ్రాంచ్ కొండాపూర్ లో చదువుకుంటున్న విద్యార్థలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తిని తరువాత విద్యార్థులకు విపరీతమైన కడుపునొప్పి రావడం వాంతులు, విరోచనాలు కలగడంతో నీరసంతో బెడ్‌ కి పరిమితం అయ్యారు. యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రంగంలోకి దిగింది. నిన్నటి నుండి అస్తవ్యస్తకు గురి అయిన విద్యార్థులను పట్టించుకోని యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు అస్వస్థలకు గురయ్యారనే విషయం తెలియగానే AIYF యువజన సంఘం శ్రీచైతన్య కాజీజీకి చేరుకుంది. విద్యార్థుల యోగక్షేమాలపై ఆరా తీసింది. గంటలు గడుస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం పై మండిపడ్డారు.

Read also: California : కాలిఫోర్నియాలోని జూనెటీన్త్ వేడుకలో మళ్లీ హింస.. 15 మందిపై కాల్పులు

విద్యార్థుల ప్రాణాలతో శ్రీచైతన్య యాజమాన్యం చలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ కి తరలించాలని AIYF యువజన సంఘం డిమాండ్ చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల్లో ఫీజులు తీసుకుంటూ మంచి ఆహారం అందించడంలో శ్రీ చైతన్య యాజమాన్యం కోల్పోతుందని విమర్శలు గుప్పించారు. విద్యార్థులకు తోడుగా AIYF యువజన సంఘం ఉంటుందని తెలిపారు. అస్వస్థతకు గురైనా విద్యార్థులను వెంటనే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. యాజన్యం దిగి వచ్చి విద్యార్థుల యోగ క్షేమాలు తెలుసుకోవాలని అన్నారు. సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనా యాజమాన్యం అడిగిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి విద్యార్థులకు మెరుగైన వైద్యం, మంచి ఆహారాన్ని అందించాలని డిమాండ్‌ చేస్తున్నామని పేర్కొన్నారు.