Site icon NTV Telugu

No Holidays: స్కూల్స్ కు సెలవులు వద్దంటూ విద్యార్థి లేఖ..!

Student Letter Cm

Student Letter Cm

No Holidays: ఏ పిల్లలైన సరే సెలవులు అంటే ఎగిరి గంతేస్తారు. స్కూల్స్ కు సెలవులు వస్తున్నాయంటే చాలు పిల్లల సంతోషానికి అవధులు ఉండవనే చెపొచ్చు. మరి స్కూల్స్ కు సెలవులు ఎప్పుడెప్పుడు అని అందరూ విద్యార్థులు ఎదురు చూస్తుంటారు. కొన్ని రోజుల్లో ఎండల కారణంగా హాఫ్‌ డే స్కూల్స్‌ సెలవులు వస్తున్నాయని పిల్లలు సంబరపడుతున్నారు. కాకపోతే ఓ విద్యార్థి మాత్రం సెలవులు అంటే మాత్రం బాధపడుతున్నాడు. అయితే అసలు ఆ విద్యార్థి వేసవి సెలవులు ఎందుకు వద్దంటున్నాడో తెలుసుకోవాలంటే మాత్రం ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. తెలుగు రాష్ట్రలలో ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దశకు చేరుకుంది. అలాగే బయట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఒంటి పూట బడుల నేపథ్యంలో ఉదయం 8 నుంచి 12:30 గంటల వరకు మాత్రమే పాఠశాలలని నిర్వహించాలని పూర్తి షెడ్యూల్ ‎ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. మధ్యాహ్న సమయం 12:30 గంటలకు పిల్లలకు భోజనం అందించి పంపించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో తెలిపింది.

Read also: Telangana Student: అమెరికాలో జెట్‌స్కీ ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి!

ఇక పూరేతి వివరాలలోకి వెళితే.. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలోని మునిపంపులకు చెందిన స్వాతి, నగేష్ దంపతుల కుమారుడు సాత్విక్. ఏఈ అబ్బాయి తన రెండేళ్ల వయసులోనే కుటుంబ విభేదాల కారణంగా తల్లిదండ్రులు విడిపోయారు. దాంతో ఈ అబ్బాయి వలిగొండ మండలం ఇస్కిల్లాలో ఉన్న తన అమ్మమ్మ వద్ద ఉంటూ 5వ తరగతి వరకు పూర్తి చేసాడు. ఆపై ఆ అబ్బాయి తండ్రి నగేష్ వద్దకు చేరి ఏడవ తరగతి వరకు విద్య పూర్తి చేసాడు. ఆ తర్వాత నకిరేకల్ మండలం ఉన్న మూసి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సీటు సంపాదించిన సాత్విక్‌ ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు.

Read also: NBK 109 : బాలయ్య మూవీలో మరో మలయాళ హీరో.. ఎవరంటే..?

అయితే తన స్నేహితులందరూ హాఫ్ డే స్కూల్స్ కోసం ఎదురు చూస్తుండగా.. సాత్విక్ మాత్రం సెలవులు వద్దంటూ తన గోడును నోట్ బుక్ లో రాసుకున్నాడు. వేసవి సెలవుల్లో తాను ఇంటికి వెళితే మాత్రం తనకి అన్నం దొరకదని.. దాంతో తాను ఇంటికి వెళ్లాలని లేదని రాసుకున్నాడు. ఎలాంటి వేసవి సెలవులు తనకి ఇవ్వకండి.. నేను మాత్రం బడిలోనే ఉంటానని.. నాకు అన్నం పెట్టండి అంటూ సాత్విక్ ఆ లేఖలో రాసుకొచ్చాడు. అంతేకాకుండా తాను బాగా కష్టపడి చదువుకుంటానని, ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదుగుతానంటూ సాత్విక్ తన కష్టాలను తన నోట్ బుక్ లో రెండు పేజీల్లో పేర్కొన్నాడు. ఇలా నోట్ బుక్ ‎లో రాసిన ఈ లెటర్ కాస్త తన క్లాస్ టీచర్ కంట పడడంతో.. ఈ లెటర్ ‎ను చూసిన క్లాస్ టీచర్ ఆ అబ్బాయిని పిలిపించుకొని అతడి పరిస్థితిని తెలుసుకొని విచారించారు. దాంతో దాతల సహాయం సాత్విక్‎ కోసం ఆ లెటర్‎ను క్లాస్ టీచర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‎ గా మారింది.
Stock Market: ఆ దెబ్బకు భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..!

Exit mobile version