NTV Telugu Site icon

JNTU: కూకట్‌పల్లి జేఎన్టీయు వద్ద ఉద్రిక్తత.. ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన

Jntu

Jntu

NSUI Protest At JNTU: కూకట్‌పల్లి జేఎన్టీయూ యూనివర్సటీ వద్ద ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. స్టూడెంట్‌ లీడర్‌ ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్‌ మీడియాతో మాట్లాడుతూ.. యూనివర్సిటీ పరిధిలోని R17, R18, R22లో జరిగిన పరీక్షలకు సంబంధించి క్రెడిట్‌ విధానాల వల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కోవిడ్ సమయంలో సరైన తరగతులు జరగక విద్యార్థులకు ఇబ్బందులు పడడమే కాకుండా అవస్థలు పడ్డారని గుర్తు చేశారు.

Also Read: Election Commission : తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన ఈసీ

యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాలలో మార్పులు చేసి R17, R18, R 22 లో డిటైండ్ అయిన విద్యార్థులను మినహాయించి తదుపరి తరగతులకు ప్రమోట్ చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. లేదంటే ఎన్నికల అనంతరం భారీ ఎత్తున జేఎన్టీయూ యూనివర్సిటీని ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అధికారులు వారికి న్యాయం చేయాలని బల్మూరి వెంకట్ కోరారు.

Also Read: CM KCR: ఆటో డ్రైవర్లకు కేసీఆర్‌ గుడ్ న్యూస్.. ఆ పన్ను రద్దు చేస్తామని ప్రకటన..