Strong Rooms: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇక, లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది. గతంతో పోల్చితే ఈసారి ప్రతి పోలింగ్ బూత్ దగ్గర పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఓటింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో ఉంచారు. ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపు ధీమాతో ఉన్నారు. ఇక, డిసెంబర్ 3వ తారీఖున ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి నుంచి ఎన్నికల అధికారులు, పోలీసు అధికారుల వ్యూహాత్మకంగా పనిచేశారు. మొత్తం తెలంగాణ ఎన్నికల్లో దాదాపు 70 వేలకు పైగానే పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Read also: Bengaluru Schools: బెంగళూరులో ఒకేసారి 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
అయితే, ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్స్ లలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 144 సెక్షన్‌తో పాటు మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నారు. మొదటి అంచెలో పారామిలటరీ బలగాలు, రెండో స్థాయిలో సాయుధ సిబ్బంది, మూడో స్థాయిలో సివిల్ పోలీసులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. అగ్నిప్రమాదానికి అవకాశం లేకుండా అగ్నిమాపక పరికరాలను సైతం అధికారులు అందుబాటులో ఉంచారు. ఇక, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భారీ భద్రత కొనసాగుతుంది. స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పహారా కాస్తున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే స్ట్రాంగ్ రూమ్స్ లోకి అనుమతి చేస్తున్నారు. ఇతరులకు ఎవరిని స్ట్రాంగ్ రూమ్ లలోకి పర్మిషన్ ఇవ్వడం లేదు.. ఇక, ఈ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఒక డీసీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలతో పాటు ఇతర సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నారు.
స్ట్రాంగ్ రూమ్ లాంటి భద్రతా ఏర్పాట్లు ఇలా…
● స్ట్రాంగ్ రూమ్‌కి ఒకే ప్రవేశ ద్వారం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గదికి డబుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేయబడింది మరియు ఒకటి దాని ఇన్‌ఛార్జ్‌తో మరియు మరొకటి మేజిస్ట్రేట్ సాధికారత కలిగిన అధికారి వద్ద ఉంచబడుతుంది.
● స్ట్రాంగ్ రూం 24 గంటలూ సాయుధ రక్షణలో ఉంటుంది, CCTV కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించబడుతుంది.
● స్ట్రాంగ్ రూమ్ యొక్క మూడంచెల భద్రతలో, మొదటి స్థాయిలో కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. దీని కోసం, కనీసం ఒక విభాగం (13 మంది) 24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా ఒక ప్లాటూన్ (39 మంది) కేటాయించబడింది.
● రాష్ట్ర సాయుధ పోలీసులు ద్వితీయ శ్రేణిలో మరియు సాధారణ పోలీసు సాయుధ బలగాలు మూడవ శ్రేణిలో మోహరించబడ్డారు.
● స్ట్రాంగ్ రూమ్‌లో అమర్చిన CCTV కెమెరాలు ICCC యొక్క కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (CCC)కి కనెక్ట్ చేయబడ్డాయి. ఇక్కడి సిబ్బంది దృశ్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టారు.
నియోజకవర్గ స్ట్రాంగ్‌రూమ్/ఓట్ల లెక్కింపు కేంద్రం
* ముషీరాబాద్ AV కళాశాల, దొమ్లగూడ
* మలక్‌పేట్ అంబర్‌పేట్ ఇండోర్ స్టేడియం
* జూబ్లీ హిల్స్ KVBR ఇండోర్ స్టేడియం, యూసుఫ్‌గూడ
* సనాతన్ నగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్, OU
* నాంపల్లి ఫైన్ ఆర్ట్స్ కళాశాల, మాసబ్ ట్యాంక్
* కారవాన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, మసబ్ ట్యాంక్
* గోషామహల్ కోఠి మహిళా కళాశాల
* చార్మినార్ కమల నెహ్రూ పాలిటెక్నిక్, ఎగ్జిబిషన్ గ్రౌండ్
* చాంద్రాయణగుట్ట నిజాం కళాశాల, బషీర్‌బాగ్
* యాకుత్‌పురా వనితా మహా విద్యాలయ, ఎగ్జిబిషన్ గ్రౌండ్
* బహదూర్‌పురా అరోరా అకాడమీ ఆఫ్ లీగల్ సైన్సెస్, బండ్లగూడ
* సికింద్రాబాద్ PGRR దూరవిద్యా కేంద్రం, OU
* కంటోన్మెంట్ వెస్లీ కళాశాల, సికింద్రాబాద్
* ఖైరతాబాద్ KVBR ఇండోర్ స్టేడియం, యూసుఫ్‌గూడ
* అంబర్‌పేట్ రెడ్డి మహిళా కళాశాల, YMCA
Mirna Menon: మల్లె పువ్వులాంటి అందాలతో మత్తుక్కిస్తున్న…మిర్నా మీనన్