NTV Telugu Site icon

MLA Kranti Kiran : టీఆర్‌ఎస్ బలం, దమ్ము దీంతో బహిర్గతమయ్యింది

నిన్న జరిగిన కేసీఆర్ సభ విజయవంతమైనదుకు సంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, సీడీసీ ఛైర్మెన్ బుచ్చిరెడ్డి లు హజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్ట్ పూర్తయ్యేలా ప్రజా ప్రతినిధులం అందరం కృషి చేసి ప్రజలకు అందుబాటులో కి తెస్తామన్నారు. నారాయణఖేడ్ సీఎం సభను విజయవంతం చేసిన ప్రతీ ఒక్క కార్యకర్త, నాయకులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ బలం, దమ్ము ఎంతో నారాయణఖేడ్ సభ ద్వారా బహిర్గతమయ్యిందని ఆయన అన్నారు. ఎవరూ ఊహించనంత స్థాయిలో సభను విజయవంతం చేసిన జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్ కు అభినందనలు తెలిపారు.

అంతేకాకుండా సంగారెడ్డి జిల్లాకు ముఖ్యమంత్రి చేత నిధులు కేటాయించేలా చేసిన మంత్రి హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సభను విజయవంతం చేసేందుకు అహర్నిశలు కృషి చేసిన మంత్రి హరీష్ రావు కు కృతజ్ఞతలని, అసలు సంగారెడ్డి ప్రాంతానికి గోదావరి నీళ్లు వస్తాయి అన్న విషయం కలలో కూడా ఊహించలేని పరిస్థితుల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. సంగారెడ్డి జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటారని, సంగారెడ్డి జిల్లాలో అన్ని మున్సిపాలిటీలకు, గ్రామాలకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.