NTV Telugu Site icon

Cabinet Meeting: బడ్జెట్‌ ఆమోదమే ఎజెండా.. నేడు ప్రగతిభవన్‌లో కేబినెట్‌ భేటీ

Kcr Cabinet

Kcr Cabinet

Cabinet Meeting: రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌ లో కేబినెట్‌ భేటీ జరగనుంది. బడ్జెట్‌ను ఆమోదించేందుకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన భేటీ జరగనుంది. ఇవాల ఉదయం 10.30 గంటలకు సమావేశం జరగనుంది. బడ్జెట్ పై చర్చించిన తర్వాత ఆమోదించనుంది. ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో బడ్జెట్ ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎన్నికల ఏడాది బడ్జెట్ కావడంతో ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై సమావేశంలో కీలకంగా చర్చిస్తారు. ఈ భేటీలో మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం తరపున చర్చ, విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం సహా సంబంధిత అంశాలపై కేబినెట్‌లో మార్గదర్శనం చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇక, పాలనా పరమైన, రాజకీయ పరమైన అంశాలు కూడా కేబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం అనంతరం బీఆర్ఎస్ సభ కోసం సీఎం కేసీఆర్ నాందేడ్ బయల్దేరి వెళ్లనున్నారు కేసీఆర్.. అయితే, కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోదం తప్ప ఎజెండాలో ఇతర అంశాలు ఏమి లేవని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి.

Read also: KCR Nanded Tour: బీఆర్ఎస్ సభకు నాందేడ్ ముస్తాబు.. కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ

2023-24లో కేంద్ర పన్నుల నుంచి రాష్ట్ర వాటాగా 21 వేల కోట్లకు పైగా వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి నిధులు వస్తాయి. కేంద్రం రాష్ట్రానికి అదనపు నిధులు, గ్రాంట్లు ప్రతిపాదించలేదు. రుణ పరిమితిని కూడా పెంచడానికి అనుమతి లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఆదాయాలు, ఇతర వనరులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు.ఎన్నికల దృష్ట్యా అన్ని అంశాలను పరిశీలించి బడ్జెట్‌ను తీసుకువస్తాం. ఈ ఏడాది కూడా భారీ బడ్జెట్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఏడాది బడ్జెట్‌ రెండు లక్షల 52 వేల కోట్లు కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇది మూడు లక్షల కోట్ల మార్కుకు చేరుకుంటుందని అంచనా. రేపు (సోమవారం) ఉదయం 10 గంటల 30 నిమిషాలకు.. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. 7న అసెంబ్లీకి సెలవు. 8న బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనుంది. అదే రోజు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పనున్నారు. 9,10, 11 తేదీల్లో పద్దుల పైన చర్చ జరగనుంది. సభ గ్రాంట్స్ ను అమోదించనుంది. వచ్చే ఆదివారం 12న ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. అదే రోజు చర్చ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది.