NTV Telugu Site icon

SSC Hindi Paper Leak: వరంగల్ లో హిందీ పేపర్ లీక్.. స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో ప్రత్యక్షం

Ssc Hindi Paper Leak

Ssc Hindi Paper Leak

SSC Hindi Paper Leak: తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరుగుతుండగా చోటుచేసుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. పదో తరగతి పరీక్షల తొలి రోజైన సోమవారం వికారాబాద్‌ జిల్లాలో పరీక్ష ముగిసిన కొద్ది నిమిషాల్లోనే వాట్సాప్‌ గ్రూప్‌లో తెలుగు ప్రశ్నపత్రం ప్రత్యక్షమై సంచలనం సృష్టించింది. తాజాగా ఈరోజు వరంగల్‌లో 10వ తరగతి హిందీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కలకలం సృష్టిస్తోంది. ఉదయం 9.30 గంటలకు ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. పదోతరగతి ప్రశ్నపత్రం స్టూడెంట్ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రశ్నపత్రం ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను సేకరించడం ప్రారంభించారు. అయితే ఈ ప్రశ్నపత్రం అసలైనదా? అది నకిలీదో కూడా తెలియాల్సి ఉందని అంటున్నారు. వరుసగా రెండో రోజుకూడా పదోతరగతి ప్రశ్నాపత్రం లీక్ అవడంతో ఈ పరిణామాలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read also: Kunamneni Sambasiva Rao: కక్కుర్తి పడి ఇక్కడ ఎవరు లేరు.. కూనంనేని సంచలన వ్యాఖ్యలు..

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పదో తరగతి జవాబు పత్రాల మాయం అవకడం కలకలం రేపింది. పోస్టు ఆఫీస్ నుంచి బస్టాండ్ కు తరలిస్తుండగా ఒక్క కట్ట జవాబు పత్రాలు మిస్ అయినట్లు తెలిపారు. ఆటోలో తరలిస్తుండగా మిస్ అయినట్టుగా పోస్ట్ మాస్టర్ హరీష్ ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లను అధికారులకు ఫిర్యాదు చేశారు. మాయమైన జవాబు పత్రాల కట్టలో సుమారు 30 మందికి సంబంధించిన ఆన్సర్ షీట్స్ ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. ఎవరు జవాబు పత్రాలను కొట్టేశారు. ఆటోలో తరలిస్తున్నప్పుడే మిస్‌ అయ్యాయా? లేక ఆటో ఎక్కడైన ఆపడం వలన ఎవరైనా పేపర్ల కట్టను దొంగలించారా? అనే కోణంలో విచారిస్తున్నారు. ఆటో డ్రైవర్లు, తనతో పాటు ఆటోలో వెళ్లిన వారిని, పాఠశాలనుంచి ఆన్సర్‌ సీట్ పేపర్ల కట్టను ఎవరు ఆటోలో పెట్టారో వారిని విచారించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. వికారాబాద్‌ జిల్లా తాండురులో పదోతరగతి క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో నలుగురిని సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.
Tammineni Veerabhadram: షర్మిలపై తమ్మినేని సీరియస్.. రాజకీయ నాటకాలు మానుకోవాలని..

Show comments