Srinivas Goud Says First PD Act Filed On Adulterated Liquor: కల్తీ మద్యంపై మొట్టమొదటి పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జార్ఖండ్‌కు చెందిన రాజారామ్ సింగ్ హర్యానా నుండి తీసుకువచ్చిన 330 బాటిల్స్‌ను సీజ్ చేశామని అన్నారు. ఆ మద్యాన్ని ల్యాబ్‌లో పరిశీలించగా అది నకిలీ మద్యం అని తేలిందని.. దీంతో రాజారామ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి నకిలీ మద్యం తీసుకొచ్చి.. హైదరాబాద్‌లో విదేశీ మద్యం పేరుతో అక్రమంగా విక్రయిస్తున్నారని వివరించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే.. ఆ మద్యాన్ని తరలించే ట్రాస్పోర్ట్ యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ మద్యం వల్ల ప్రజల ఆరోగ్యానికి హానికరమని పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచుతామని, చెక్‌పోస్ట్‌లను పటిష్టంగా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. నకిలీ మద్యం సరఫరా చేసే వారిపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Rajasthan Gangrape: దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్.. ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి మరీ..
ఇదే సమయంలో.. తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్రంలో క్రీడా పోటీలు నిర్వహిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. రాబోయే క్యాబినెట్ మీటింగ్‌లో క్రీడా పాలసీ ప్రకటిస్తామన్నారు. క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కచ్ఛితంగా అమలయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. మూడు రకాల క్రీడలను ఒకే రోజు నిర్వహిస్తున్నామని.. సంబరాలుగా కాకుండా, సేవా కార్యక్రమాల ద్వారా జన్మదిన వేడుకలు నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు. స్కేటింగ్, సైకిలింగ్, రెజ్లింగ్ పోటీలు పెడతామన్నారు. ఈ పోటీల్లో మొత్తం 2500 మంది క్రీడాకారుల పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా.. ఈ క్రీడా పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ ఆంజనేయ గౌడ్ విడుదల చేశారు.
Chennai Crime: హారన్ కొట్టిన పాపానికి ఆటో డ్రైవర్ హత్య.. ఏం జరిగిందంటే?