Sridhar Babu: వర్షం పడకపోతే తప్పు మాదా? ఆలోచన లేకుండా మాట్లాడకండి.. కేటీఆర్ పై ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. 2023..జులై..నుండి పడాల్సిన వర్షం పడలేదన్నారు. ఏది పడితే అది మాట్లాడి.. ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతులను క్విటాలు 10 kg లు తీసుకుని నష్టం చేసింది బీఆర్ఎస్ అన్నారు. వాళ్ళు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటామన్నారు. సీఎం పై కేటీఆర్ అనుచిత వ్యాక్యలు సరికాదన్నారు. వాటర్ ట్యాంకర్ కి పైసలు తీసుకున్నామని ఎవరన్నా చెప్పారా..? అని ప్రశ్నించారు.
Read also: Elections 2024: ఇదేం ‘చిల్లర’ నామినేషన్ రా బాబోయ్.. దెబ్బకు చెమటలు చిందించిన ఎన్నికల అధికారులు..!
మిషన్ భగీరథ తప్పుడు స్కీం.. మీ కంటే ముందు ఉరూరూ నీళ్లు ఇచ్చింది మేము అన్నారు. దాన్ని ద్వంసం చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. 45 వేల కోట్లు ఖర్చు చేసినా నీటికి ఎందుకు ఇబ్బంది వచ్చిందో సమాధానం చెప్పాలి? అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో అందరూ బయటకు వస్తారు.. అందరి ఫోన్ లు ట్యాప్ చేశారు.. విచారణలో అన్నీ బయటకు వస్తాయన్నారు. కేటీఆర్ నోటీసులు ఇచ్చుకుంటే ఇచ్చుకోమను.. మేము పద్దతి ప్రకారం పని చేస్తామన్నారు. బీజేపీ కి బిటీం గా ఉన్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కి బీఆర్ఎస్ కప్పం కట్టారా..? బీజేపీ కి మీరు కప్పం కట్టారు కాబట్టి మేము కప్పం కడుతున్నాం అనుకుంటే తప్పు అన్నారు.
Narendra Reddy: బండి సంజయ్ ది దొంగ దీక్ష.. నరేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు