Site icon NTV Telugu

శ్రీరామనుజ సహస్రాబ్ది సమారోహం..భక్తి ఛానల్‌లో

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో మచ్చింతల్‌లో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్న విషయం తెల్సిందే. అయితే ఈ ఉత్సవాలకు అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చకచక జరిగిపోయాయి. రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే చిన్న జీయర్‌ స్వామి స్వయంగా ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను సైతం పంచారు. చిన్న జీయర్‌ స్వామి ఆధ్యాత్మిక పరివర్తన క్షేత్రంలో సమతా స్ఫూర్తిని పంచిన రామానుజ విగ్రహ ఆవిష్కరణతో పాటు 108 విష్ణు ఆలయాలను సైతం ప్రతిష్టించనున్నారు. అయితే ఈ కార్యక్రమాలు ఫిబ్రవరి 2 నుంచి 14వరకు భక్తి ఛానల్‌లో ప్రతక్ష ప్రసారం కానున్నాయి. ఈ కార్యక్రమాలను భక్తులు స్వయంగా వీక్షించే అవకాశాన్ని భక్తి ఛానల్‌ కల్పించింది.


Exit mobile version