Site icon NTV Telugu

నేటి నుంచి హైదరాబాద్ లో స్పెషల్ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. దేశంలో వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌ను వేగంగా అమ‌లు చేస్తున్నారు. ప్రతిరోజూ అర‌కోటి మందికి పైగా టీకాలు అందిస్తున్నారు. ఇక తెలంగాణ‌లో వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌ను వేగ‌వంతం చేశారు. ఇవాళ్టి నుంచి ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. కాల‌నీలు, బ‌స్తీల్లో కోవిడ్ సంచార టీకా వాహ‌నాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ను అందించనున్నారు. 10 రోజుల‌పాటు అర్హులైన అంద‌రికీ వ్యాక్సిన్‌లు అందింబోతున్నారు. వైద్యారోగ్యశాఖ‌, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డులు ఉమ్మడిగా వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌ను చేప‌ట్టబోతున్నారు. కాల‌నీల‌లో ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేసుకోనివారి జాబితాను సేక‌రిస్తున్నారు అధికారులు.

Exit mobile version