NTV Telugu Site icon

Ganga Pushkaralu: గంగాపుష్కరాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

Ganga Pushkaralu

Ganga Pushkaralu

Ganga Pushkaralu: ప్రతి నదికి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది (2023) గంగా నదికి పుష్కారాలు జరుగుతున్నాయి. 12 రోజుల పాటు పుష్కరాలు జరగనుండగా… ఇప్పటికే పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 22న ప్రారంభమైన పుష్కరాలు.. మే 3 వరకు జరగనున్నాయి. ఈమేరకు గంగానదీ తీరం శోభాయమానంగా మారింది. గంగాత్రి, గంగాసాగర్, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్ నాథ్, వారణాసి, అలహాబాద్ తీర ప్రాంతాల్లో పుష్కర స్నానానికి ఘాట్లను సిద్ధం చేశారు.

Read also: Traffic restrictions: రేపు కొత్త సచివాలయ ప్రారంభోత్సవం.. ఆ రూట్లల్లో వెళ్లి పరిషాన్‌ అవ్వకండి

అయితే జంట నగరాల (హైదరాబాద్, సికింద్రాబాద్) నుంచి పుష్కరాలకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. గంగా పుష్కరాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం సికింద్రాబాద్‌-బనారస్‌ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధం చేశారు. ఈ ప్రత్యేక రైళ్లు నేటి (ఏప్రిల్ 29) నుంచి మే 5 వరకు నడుస్తాయి. ఈరోజు రాత్రి 9.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మే 1వ తేదీ ఉదయం 06.30 గంటలకు బనారస్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బనారస్‌లో ఉదయం 08.35 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 6.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

మే 2వ తేదీన సికింద్రాబాద్ నుంచి బనారస్ నుంచి రాత్రి 9.40 గంటలకు రెండో రైలు బయలుదేరుతుంది. ఈ రైళ్లు మే 5వ తేదీ వరకు నిరంతరాయంగా నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. జనగాం, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్ష, నాగ్‌పూర్, ఇటాలియన్, పిపారియా, జబల్‌పూర్, కట్ని జంక్షన్ లలో ఈ రైళ్లు ఆగుతాయని అధికారులు తెలిపారు. జంక్షన్, శాంతా, మణిపూర్ మరియు ప్రయాగ్‌రాజ్ చౌక్ స్టేషన్‌లు. రైల్వే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Abhilash Tomy: చరిత్ర సృష్టించిన సెయిలర్ అభిలాష్ టామీ.. ప్రీమియర్ గ్లోబల్ రేస్‌లో 2వ స్థానం