NTV Telugu Site icon

South Central Railway: చర్లపల్లి టర్మినల్ నుంచి ధానాపూర్ కు ప్రత్యేక రైళ్లు

Train

Train

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ అందించింది. ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, విజయవాడ, భువనేశ్వర్, అసన్సోల్ & పాట్నా మీదుగా చర్లపల్లి, దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి టర్మినల్ నుంచి దానాపూర్ కు స్పెషల్ సర్వీసులు నడవనున్నాయి. మహా కుంభమేళా జరిగే ప్రయాగరాజ్ వెళ్లే వారికి దానాపూర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు ఉపయోగపడనున్నాయి.

Also Read:Teachers MLC Elections: ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్‌..! టీడీపీ, జనసేన ఓవైపు..! బీజేపీ మరోవైపు..?

కాగా ఆపరేషనల్ ఇష్యూస్ కారణంగా ఈనెల 19, 21 తేదీల్లో సికింద్రాబాద్ టు దానాపూర్, దానాపూర్ టు సికింద్రాబాద్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. దీంతో ముందస్తు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక రైళ్లను ధానాపూర్ కి నడిపిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చర్లపల్లి టర్మినల్ నుంచి ధానాపూర్ కు 9 రైళ్లు, ధానాపూర్ నుంచి చర్లపల్లి జంక్షన్ కు 9 ట్రైన్లను నడిపించనున్నారు.

Whatsapp Image 2025 02 19 At 4.46.49 Pm