NTV Telugu Site icon

Hyderabad to Ayodhya: గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్..!

Ayodhya Rama Mandir

Ayodhya Rama Mandir

Hyderabad to Ayodhya: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. జనవరి 22న ఆలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ప్రధాని మోదీ ఆలయ ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రామమందిర దర్శనానికి వెళ్లే ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు నడపడానికి రైల్వే శాఖ సిద్ధమైంది. ప్రతి శుక్రవారం ఈ రైలు హైదరాబాద్ నుండి అయోధ్యకు వెళుతుంది.

భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ అయిన భారతీయ రైల్వే కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్త రైళ్లను నడుపుతోంది. ఎప్పటికప్పుడు కొత్త రైళ్లను అందుబాటులోకి తెస్తున్నారు, కొత్త ట్రాక్‌లు వేస్తున్నారు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఇక ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఇందుకోసం దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. భవిష్యత్తులోనూ భక్తుల సంఖ్య భారీగా పెరగనుంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. అయోధ్య వెళ్లే వారి కోసం ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.

Read also: Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

రామమందిర సందర్శనకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి అయోధ్యకు రైలు సౌకర్యం కల్పిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం దృష్ట్యా యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (నెం. 15024) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇది కాచిగూడ నుంచి ఉదయం 10.50 గంటలకు బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగపూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా శనివారం సాయంత్రం 4.25 గంటలకు అయోధ్యధామ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి గోరఖ్ పూర్ వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు.
Hanuman: ఇండియన్ సూపర్ హీరో సినిమాని చూడబోతున్న భజరంగీ…